»   » సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్: పవన్ కళ్యాణ్‌తో లక్ష్మీరాయ్ (సెల్ఫీ)

సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్: పవన్ కళ్యాణ్‌తో లక్ష్మీరాయ్ (సెల్ఫీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ ఓ ముఖ్యమైన పాత్ర చేస్తోంది. దాంతో పాటు ఓ స్పెషల్ సాంగ్ కూడా చేస్తోంది. ఇటీవల ఈ సాంగుకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరిగింది.

సినిమా షూటింగ్ సందర్భంగా లక్ష్మీ రాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి తీసుకున్న సెల్ఫీ ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేసింది. దీంతో పాటు సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు కూడా పోస్టు చేసింది. లక్ష్మీరాయ్ పోస్టు చేసిన ఈ ఫోటోలకు స్టన్నింగ్ రెస్పాన్స్ వస్తోంది.

తెలుగు టాప్ స్టార్లలో ఒకరైన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని లక్ష్మీరాయ్ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఎట్టకేలకు ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం ద్వారా లక్ష్మీరాయ్ కల నెరవేడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా తర్వాత తెలుగులో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తోంది లక్ష్మీ రాయ్.

కన్ని రోజుల క్రితం...ఈ సినిమాలో తనకు అవకాశం దక్కిన విషయం తెలిసిన వెంటనే లక్ష్మీరాయ్ ట్విట్టర్ ద్వారా తన అభిమానులక ఈ విషయం వెల్లడించింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నేను ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నేను ఈ సినిమాలో ఫస్ట్ టైం డాన్స్ కూడా చేయడం మీరు చూస్తారు' అని వెల్లడించారు.

స్లైడ్ షోలో లక్ష్మీరాయ్ పోస్టు చేసిన ఫోటోస్...

సెల్పీ..

సెల్పీ..


పవన్ కళ్యాణ్ తో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో సెల్ఫీ తీసుకుంటున్న లక్ష్మీరాయ్.

పవన్ కళ్యాణ్ తో

పవన్ కళ్యాణ్ తో


పవన్ కళ్యాణ్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన లక్ష్మీ రాయ్ చాలా ఆనందంగా కనిపించింది.

సూపర్ హాట్ లుక్

సూపర్ హాట్ లుక్


సర్దార్ గబ్బర్ సింగ్ సాంగ్ చిత్రీకరణలో లక్ష్మీ రాయ్ సూపర్ హాట్ లుక్.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత తెలుగులో తన దశ తిరుగుతుందని లక్ష్మీరాయ్ ఆశిస్తోంది.

English summary
It is known that Pawan Kalyan has joined the sets of Sardaar Gabbar Singh a couple of days ago and a song is being shot on the star and Lakshmi Rai during this schedule at a specially erected set in Hyderabad. As promised earlier, Lakshmi Rai posted a selfie of hers with Pawan Kalyan, which took twitter by storm in no time.
Please Wait while comments are loading...