»   » పాలిటిక్స్, పర్సనల్ విషయాలపై పవన్ కళ్యాణ్ (ఇంటర్వూ)

పాలిటిక్స్, పర్సనల్ విషయాలపై పవన్ కళ్యాణ్ (ఇంటర్వూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్: పవన్ కళ్యాణ్ పరిచయం అక్కర్లేని పేరు. హిట్ ..ప్లాప్ లకు సంభంధం లేకుండా కలెక్షన్స్ కురిపించే వెండి తెర ఇలవేల్పు అతను. కేవలం తెరపై హీరోగానే ఉంటే అతనికి అంత పేరు,అభిమానులు ఉండకపోనేమో...తన వంతు సాయిం చేయటం...తనదైన శైలిలో ప్రపంచాన్ని ప్రశ్నించటం, క్రియేటివ్ ధాంట్స్ అందరిలో ఒకడు గా కాక విడిగా నిలబెట్టాయి.

చేసినవి తక్కువ సినిమాలే అయినా, అందులో హిట్ సినిమాలు కొన్ని మాత్రమే అయినా....పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ మాత్రం ఇతింతై, వటుడింతై అన్నట్లు పెరిగిపోయింది. హిట్లు, ప్లాపులు అనే తేడా లేకుండా నిర్మాతలకు లాభాలు తెచ్చే హీరోగా పవన్ కళ్యాణ్ పేరు తెచ్చుకున్నాడు. భిన్నమై వ్యక్తిత్వం, మంచి గుణవంతుడు కావడం వల్లనే ఆయనకు అభిమానులు, ఫాలోయింగ్ భారీగా పెరిగిగింది అనేది పలువురి వాదన.


చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా...తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయనతో పని చేయడం అంటేనే ఎంతో గొప్ప ఫీలయ్యే స్టార్ దర్శకులు, నిర్మాతలు ఉన్నారంటే ఇండస్ట్రీలో ఆయన స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందు తో ఆయన మాట్లాడారు. అందులో కొన్ని భాగాలు పవన్ అభిమానుల కోసం...

స్లైడ్ షోలో ...పవన్ ఇంటర్వూ

నాకు కోపం ఎప్పుడొస్తుందంటే...

నాకు కోపం ఎప్పుడొస్తుందంటే...

ఈ ప్రశ్న అడిగినప్పుడు పవన్ ఓ నిముషం మౌనంగా ఉండిపోయారు. తర్వాత ఆయన మాట్లాడుతూ...నేనెప్పుడూ కోపం తెచ్చుకోను..ఆలోచనలో ఉంటూంటాను. అయితే కొన్ని సిట్యువేషన్స్ కు నేను స్పందించకపోతే నా అంతరాత్మ ఒప్పుకోదు..చంపేస్తుంది. నేను అవసరమైన మేరకు మాత్రమే హింస ను నమ్ముతాను అన్నారు.

అవసరమైన మేరకు హింస అంటే...

అవసరమైన మేరకు హింస అంటే...పవన్ నవ్వి మాట్లాడుతూ..దానికి నేను ఖచ్చితమైన సమాధానం చెప్పలేను... ఉదాహరణకు నా ఇంట్లోకి ఒక దొంగ వస్తే నేను చేతులు కట్టుకొని అతన్ని బయిటకు వెళ్లమంటే వెళ్తాడా..లేక కొట్టి వెళ్లగొట్టాలా ?'

పొలిటికల్ ఎంట్రీ

పొలిటికల్ ఎంట్రీ

ప్రజారాజ్యం పార్టీ ,రాజకీయాల్లోకి వస్తారా అని అడిగితే... అలాగే మీరు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడిగిన ప్రశ్నకి పవన్ సమాధానమిస్తూ ‘ నేను రాజకీయాలకి దూరంగా ఉంటే కదా మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికని' ఆన్నారు.

నేను ఈజీగా...

నేను ఈజీగా...

తాను ఈజీగా జనం బాధలుకు,సంఘటనలకు,విచారాలకు ప్రభావితుడ్ని అవుతానని అన్నారు. అందుకేనేమో ఆయన అడిగిన వారికి కాదనకుండా గుప్త దానాలు చేస్తూంటారు. ఆయన సినిమాల్లో కూడా ఆ ఇంటెన్షన్ కనపుడుతుంది.

తోటమాలి అవ్వాలని..

తోటమాలి అవ్వాలని..

నేను ఎప్పుడూ తోటమాలి అవ్వాలని కోరుకుంటాను...నేను ఎక్కువ సేపు నా సమయాన్ని తోటలో గడపటానికి ఇష్టపడతాను అన్నారు. పవన్ కళ్యాణ్ కి ఫామ్ హౌస్ సైతం ఉంది. ఆయన షూటింగ్ లేని సమయంలో ప్రకృతిలో గడుపుతూంటారు.

నేను ఎప్పుడూ...

నేను ఎప్పుడూ...

నేను నిరంతంరం నిజమైన పవన్ కళ్యాణ్ కోసం అన్వేషణ చేస్తూంటాను. మనం ఓ ఫేజ్ నుంచి మరో ఫేజ్ కు షిప్ట్ అవుతూంటాము..అదంతా రూప విక్రయ అంటూ వేదాంతంగా జీవిత సారాంశం చెప్పారు.

డిప్రెసెడ్ పిల్లాడిని

డిప్రెసెడ్ పిల్లాడిని

నేను ఒక డిప్రెసెడ్ కిడ్ ని. నేను నిశ్చలమైన జీవితాన్ని కోరుకుంటాను. నేను ఎప్పుడూ నటుడుని కావాలనుకోలేదు. పవన్ చెప్పే ఈ మాటలు ఆయన్ని దగ్గరగా పరిశీలించిన వారు చెప్తూంటారు. ఆయనకి ఇతర విషయాలపై వ్యామోహాలు తక్కువ అని.

మూడు విషయాలు...

మూడు విషయాలు...

నా మనస్సు మొత్తం మూడు విషయాలతో నిండిపోయి ఉంటుందని అవే ప్రకృతి, పిలాసఫీ మరియు సామాజిక సమస్యలు. ఇతరులుని మనమేం చేయలేం. ఆ శక్తి లేదు.. మనని మనమే మార్చుకోవాలి

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్‘అత్తారింటికి దారేది' చిత్రం ఇప్పటికే కలెక్షన్ల పరంగా పలు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో 50 రోజుల వేడుక జరుపుకుని మరో రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా నైజాం ఏరియాలో రూ. 20 కోట్లు, సీడెడ్ రూ. 10 కోట్లు, ఓవర్సీస్ రూ. 10 కోట్ల మార్కను అధిగమించి భారీ కలెక్షన్లు రాబడుతోంది. వైజాగ్, గుంటూరు, కర్ణాటక లాంటి ఏరియాల్లో మగధీర రికార్డులను తుడిపెట్టింది. ప్రస్తుతం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించిన అత్తారింటికి దారేది.....రూ. 100 కోట్ల వసూళ్లను అందుకునే దిశగా పరుగులు పెడుతోంది.

గబ్బర్ సింగ్ 2

గబ్బర్ సింగ్ 2

పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. సినిమా ఇంకా మొదలు కానప్పటికీ.....ముందస్తుగా పక్కా ప్లానింగుతో రెడీ అయ్యారు దర్శక నిర్మాతలు. దర్శకుడు సంపత్ నంది ఇప్పటికే స్క్రిప్టు వర్కు పూర్తి చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమా మొదలైన తర్వాత....అంతా ప్లానింగ్ ప్రకారం, అనుకున్న రోజు అనుకున్న షెడ్యూల్ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విడుదల తేదీ విషయంలో కూడా ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చారు. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన తేదీనే అంటే...మే 11, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు.

English summary
In a rare byte given to The Hindu, Pawan Kalyan has revealed some interesting details. He says that three things occupy his mind most of the time and they are nature, philosophy and social issues. When asked about his anger, Pawan Kalyan also had this to say. ” I believe in permissible violence and not necessarily nonviolence”. He quoted an example of a robber entering the house. “When a robber enters the house, should you fold your hands and respect him or should you bash him up? “, he quipped. The star hero went on to say that he feels obligated to respond to certain events because of his conscience.
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu