»   » విబేధాలకు తెర: చిరంజీవి ఇంటికెళ్లిన పవన్ కళ్యాణ్

విబేధాలకు తెర: చిరంజీవి ఇంటికెళ్లిన పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవికి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కు పడటం లేదని గత కొంత కాలంగా మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అలాంటివేమీ లేవని మెగా ఫ్యామిలీ మెంబర్స్ పలు సందర్భాల్లో వివరణ ఇచ్చినా బయట మాత్ర ప్రచారం మరోలా ఉంది.

శుక్రవారం శిల్పకళా వేదికలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. పవర్ స్టార్ కావాలంటూ గోల చేసిన అభిమానులకు నాగ బాబు మొట్టికాయలేసారు. వాడిని ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదు. దానికి మేమేం చేస్తాం అంటూ నాగబాబు మండి పడ్డారు. ఈ నేపథ్యంలో చిరు-పవన్ మధ్య విబేధాలున్నాయనే వార్తలు మరింత బలంగా వీచాయి.

pawan,CHiranjeevi

అయితే ఈ వార్తలకు తెరదించుతూ అన్నయ్య చిరంజీవిని నివాసానికి శనివారం వెళ్లారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా చిరంజీవికి పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలం తర్వాత పవన్ చిరు నివాసానికి వెళ్లారు. చిరంజీవితో కలిసి పవన్ పార్క్‌హయత్ హోటల్‌కి వెళ్లనున్నట్లు సమాచారం. చిరంజీవి నేడు 60వ జన్మదినం జరుపుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరుగబోతున్నాయి. బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల నుండి పలువురు ప్రముఖులు ఈ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాబోతున్నారు.

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన భార్య జయాబచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, అతడి కుటుంబ సభ్యులు, కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, శ్రీదేవి, బోనీ కపూర్‌, టబూ ఇలా పలువురు స్టార్స్ ఈ బర్త్ డే వేడుకలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ష్టష్ఠి పూర్తి వేడుక ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరుపబోతున్నారు.

చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ పార్టీని గ్రాండ్ గా జరుపాలని పక్కాగా ప్లాన్ చేసాడు. ప్రముఖుల ఆహ్వానాల దగ్గర నుండి ఏర్పాట్ల వరకు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ వేడుకల్లో ప్రత్యేక వంటకాలు అతిథుకు వడ్డించనున్నారు. ఇందులో ‘చిరంజీవి దోసె' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ పుట్టినరోజు వేడుకల్లో చిరంజీవి ఇంటి హెడ్ కుక్ శ్రీను..... చిరంజీవి దోసెను స్వయగా వేసి అతిథులకు వడ్డించబోతున్నాడు. కనీ వినీ ఎరుగని నీతిలో భారీగా ఖర్చు పెట్టి రామ్ చరణ్ ఈ పుట్టినరోజు వేడుక నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం చిరంజీవి పుట్టినరోజు వేడుకలు హాట్ టాపిక్ అవుతోంది.

English summary
Pawan Kalyan meets Chirajeevi today at his home.
Please Wait while comments are loading...