»   » బర్త్ డే స్పెషల్: ‘కాటమరాయుడు’గా పవన్ కళ్యాణ్ (ఫస్ట్ లుక్)

బర్త్ డే స్పెషల్: ‘కాటమరాయుడు’గా పవన్ కళ్యాణ్ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించిన పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్ ప్రకటించలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత శరత్ మరార్ సినిమా టైటిల్ గురించి అఫీషియల్ ప్రకటన చేసారు.

ఈ విషయమై శరత్ మరార్ ట్వీట్ చేస్తూ...'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్ సగర్వంగా ప్రకటిస్తోంది. పవన్ కళ్యాణ్-డాలీ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రానికి 'కాటమరాయుడు' టైటిల్ ఫిక్స్ చేసాం' అంటూ ట్వీట్ చేసారు.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు శరత్ మారార్ వెల్లడించారు. 'గోపాల గోపాల' దర్శకుడు కిశోర్‌కుమార్‌ పార్దసాని(డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్‌కల్యాణ్‌ 'కాటమరాయుడా కదిరి నరసింహుడా..' అంటూ పాట పాడారు. ఇపుడు అదే లైన్ తో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుండటం విశేషం.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు....

 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ప్రకటించారు.

పవర్ స్టార్

పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ ప్లాపులను జయించిన స్టార్ అంటుంటారు ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన సినిమా ప్లాపైనా, హిట్టయినా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్, టాప్ డైరెక్టర్లు, నిర్మాతల్లో ఆయనతో చేయాలనే కోరిక తగ్గక పోవడమే ఇందుకు కారణం.

 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కూడా రెమ్యూనరేషన్ భారీగా తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఆయన ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలో ఇది హయ్యెస్ట్ అమౌంట్. మరి పవర్ స్టారా మజాకా!

వచ్చే ఏడాది

వచ్చే ఏడాది

వచ్చే ఏడాది నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
"On the eve of #PSPK PawanKalyan's birthday Northstar Entertainment proudly announces the title of d film under production as 'Katamarayudu'" sharath Marar tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu