»   » తిరిగి తిరిగి చివరి పార్ట్ కు వచ్చిన పవన్...!

తిరిగి తిరిగి చివరి పార్ట్ కు వచ్చిన పవన్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కల్యాణ్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ (కాళి వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగం కోల్ కతా నగరంలో జరిగింది. ఆ తర్వాత తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని గ్రామాలలో కూడా జరిగింది. ఈ చిత్రం టైటిల్ (షోడో లేక కాళీ) ను సెప్టెంబర్ రెండున పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటిస్తారు. సారాజేన్, అంజనీ లావనియా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నాడు. విజయదశమికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

పవన్ కళ్యాణ్ కాళీ చిత్రాన్ని ముందుగా అనుకున్నట్లు రానున్న దసరా పర్వదినం సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని ఈ చిత్రం యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక కాళీ షూటింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్" సినిమా చేస్తోన్న పవన్ కళ్యాణ్, తర్వాత వీరుపోట్ల దర్శకత్వంలో ఒక సినిమాచేయనున్నాడు . అందుకుగాను జనవరిలో 14రీల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ కి డేట్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే బ్యానర్ లో ప్రస్తు మహేష్ దూకుడు విడుదలకు శరవేగంగా సిద్దమౌతోంది.

English summary
Power Star Pawan Kalyan’s latest film Kaali (tentatively titled) is currently being filmed in Ramoji film city, Hyderabad. Earlier it was shot in Kolkata, Pollachi and Kerala. The film will be almost complete by the time this schedule wraps up and the film will be ready for release in December.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu