Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్ మళ్ళీ మొదలెట్టాడ్రోయ్....
జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, కృతి కర్బంద హీరో హీరోయిన్స్ గా పరమేశ్వర ఆర్ట్స్ పతాకం పై గణేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం ఉదయం రామోజీ ఫిలిం సిటిలో లాంఛనంగా ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, సెకండ్ హీరోయిన్ కృతి, కొంత మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించారు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు కాలేదు.
ఈ సందర్బంగా దర్శకుడ మాట్లాడుతూ ఇది ప్రధానమైన ప్రేమ కథా చిత్రమనీ, త్రివిక్రమ్ చేసిన కంట్రిబ్యూషన్ చాలా అద్బుతంగా ఉంటుందనీ, ఇక పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేయనున్నారనీ, ప్రేక్షకులు ఎదురు చూసే అన్ని అంశాలను ఇందులో మేళవించామనీ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రం తొలి షెడ్యూల్ అక్టోబర్ 3 వరకు రామోజీ ఫిలిం సిటీలో, ఆ తర్వత అక్టోబర్ 7 నుంచి డార్జిలింగ్, వారణాసి, పాటియాలలో, నవంబర్ షెడ్యూల్ విదేశాల్లో ఉంటుందనీ, డిసెంబర్ వరకు చిత్రీకరణ పూర్తవుతుందనీ నిర్మాత తెలియజేశారు. త్రిష, కృతి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రానికి మణిశర్మ చక్కని సంగీతాన్ని అందించనున్నారు.