»   » దటీజ్ పవర్ స్టార్: తన ప్లానింగ్ ఇదే అంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు

దటీజ్ పవర్ స్టార్: తన ప్లానింగ్ ఇదే అంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రికార్డులు బద్దలు కొడుతుందనుకున్న సర్ధార్ గబ్బర్ సింగ్ దారుణంగా పరాజయం చెందటంతో కాస్త నిరాశపడ్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెల్లగా తేరుకున్నాడు ఇక మళ్ళీ ప్రస్తుతం వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే సినిమాల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్న పవర్ స్టార్ ఈ మిగిలిన సమయం లోనే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు.

అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఏకంగా మరో రెండు సినిమాలను కూడా ట్రాక్ మీదపెట్టేశాడు. ఈ సినిమాలతో తన సన్నిహితులకు మేలు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం శరత్ మరార్ నిర్మాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవర్ స్టార్. ఈ సినిమాతో నిర్మాతగా నష్టాలను ఎదుర్కొన్న శరత్ మరార్ తో పాటు, కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న ఎస్ జె సూర్య కు కూడా ఒకే సారి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడు.

Pawan Kalyan next movies details

మరోసారి ఖుషి లాంటి భారీ హిట్ తో అభిమానులను అలరించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ,,ఆ తరువాత, దాసరి నారాయణరావుకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలతో పాటు తనకు గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చి తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హరీష్ శంకర్ తోనూ కలిసి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.

ఈ సినిమాను ఎఎమ్ రత్నం బ్యానర్లో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా గతంలో తనకు సాయం చేసి రాజకీయాల్లోకి వెళ్ళే ముందే వారందరికీ తిరిగి సాయం చేసేసి లెక్కలు సమం చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు...

English summary
Pawan Kalyan's fixes target 3 movies in 2 years
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu