twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిషిత్ వాడిన కారు నాది కాదు.. వాయిదాలు కట్టలేక అమ్ముకొన్నాను.. పవన్ కల్యాణ్

    నారాయణ సంస్థల అధిపతి, ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మరణానికి సంబంధించిన వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. రోడ్డు ప్రమాదానికి గురైన కారు సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది

    By Rajababu
    |

    నారాయణ సంస్థల అధిపతి, ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మరణానికి సంబంధించిన వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. రోడ్డు ప్రమాదానికి గురైన కారు సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది అనే మాట వినిపిస్తున్నది. అయితే ఆ కారు తనది కాదని పవన్ కల్యాణ్ ఓ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.

    `రూమర్లు ఇలా..

    `రూమర్లు ఇలా..

    నిషిత్ ప్రమాదానికి గురైన సంఘటనా స్థలానికి పవన్ కల్యాణ్ అక్కడ పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తాను ఇష్టపడి కొనుక్కున్న బెంజ్ కారు దుస్థితి గుండెలను పిండేసిందట. తాను ఎంతో ఇష్టంవగా డిజైన్ చేయించుకొన్న కారు నుజ్జు నుజ్జు కావడం జీర్ణించుకోలేకపోయినట్టు వార్తలు వచ్చాయి.

    తోసిపుచ్చిన పవన్

    తోసిపుచ్చిన పవన్

    అయితే ఆ వార్తలను పవన్ కల్యాణ్ తోసిపుచ్చారు. గురువారం హైదరాబాద్‌లో గ్రూప్2, ఇంజినీరింగ్ విద్యార్థులతో భేటీ అయిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నితీశ్ ఉపయోగించిన కారు నాది కాదు.

    వాయిదాల కట్టలేక..

    వాయిదాల కట్టలేక..

    గతంలో బెంజ్ కారు నా వద్ద ఉండేది. ప్రమాదానికి గురైన నిషిత్ కారు నా దగ్గర ఉన్న మోడల్ కంటే బెటర్‌ది అని వివరణ ఇచ్చారు. నేను చాలా ఇష్టపడి బెంజ్ కారును కొనుక్కున్నాను. కానీ వాయిదాలు కట్టలేక దానిని అమ్మాను అని పవన్ చెప్పారు.

    పవన్ వివరణతో రూమర్లకు తెర

    పవన్ వివరణతో రూమర్లకు తెర

    దీంతో పవన్ కల్యాణ్ కారు ప్రమాదానికి గురైందని, హీరో రాంచరణ్ పెళ్లి సమయంలో అదే కారును ఉపయోగించారని వచ్చిన రూమర్లకు పవన్ కల్యాణ్ వివరణతో క్లారిటీ వచ్చింది. నిషిత్ ప్రమాదానికి కారణమైన కారుతో పవన్ కల్యాణ్‌కు సంబంధం లేదు అనే విషయంపై స్పష్టత వచ్చింది.

    English summary
    Actor Pawan Kalyan given clarity on Benz car which happend accident while Nishith driving. Nithish is son of AP minister Naranyana. He met accident Wednesday. In this occassion, Pawan Kalyan said that long back I own Benz car, because of financial crisis that car sold for someone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X