»   » పవన్‌పై నితిన్ అభిమానానికి నిలువెత్తు రూపం.. ఈ పెయింటింగ్ ఎక్కడ ఉందో తెలుసా?

పవన్‌పై నితిన్ అభిమానానికి నిలువెత్తు రూపం.. ఈ పెయింటింగ్ ఎక్కడ ఉందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఫ్యాన్ జాబితాలో కేవలం ప్రేక్షకులే కాదు.. సినీ హీరోలు కూడా ఉంటారు. పవన్‌కు ఉన్న వీరాభిమానుల్లో హీరో నితిన్ ఒకరు. తాను పవన్‌కు భక్తుడినని చెప్పుకొంటారు. తన సినిమాల్లో పవన్ ప్రస్తావన కంపల్సరీగా ఉంటుంది. పవర్ స్టార్ పాటలను తన సినిమాల్లో రీమిక్స్ చేసిన అభిమానాన్ని చాటుకొంటారు. పవన్, నితిన్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తాజాగా పవన్, నితిన్ కలిసి ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

పవన్, నితిన్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం

పవన్, నితిన్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం

సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్, నితిన్ మధ్య ఓ ప్రత్యేకమైన రిలేషన్ ఉంది. నితిన్ చూపించే అభిమానానికి పవన్ స్పందిస్తుంటారు కూడా. నితిన్ సినీ ఫంక్షన్లకు హాజరవుతుంటాడు పవన్. అంతేకాకుండా తన తోటలో కాసిన మామిడి పండ్లను ప్రతీఏటా గుర్తుంచుకొని పంపిస్తుంటాడు పవర్ స్టార్.

పవన్‌కు నితిన్ వీరభక్తుడు

పవన్‌కు నితిన్ వీరభక్తుడు

జయం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ మొదటి నుండి పవన్‌కు వీరాభిమాని. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ప్రతి సినిమాలో పవన్ మేనరిజాన్ని చూపించే ఈ హీరో ఆ మధ్య జ‌రిగిన‌ ఓ ఆడియో వేడుకలో పవన్ పై తనకున్న ప్రేమను బాహటంగానే చెప్పాడు. ఇదిలా ఉంటే నితిన్ హీరోగా త్రివిక్రమ్, పవన్‌లు ఓ చిత్రాన్ని రూపొందించడం విశేషం.

అభిమాని ఇచ్చిన పెయింటింగ్

అభిమాని ఇచ్చిన పెయింటింగ్

ఆ మధ్య వచ్చిన ‘చిన్న‌ దాన నీకోసం' ఆడియో వేడుక‌లో ఓ అభిమాని గిఫ్ట్ గా ఇచ్చిన ఫోటోను హీరో నితిన్ ఇప్ప‌టికి భ‌ద్రంగా దాచుకున్నాడు. వీలు దొరికినప్పుడల్లా పవన్ అంటే తనకి ఎంత ఇష్టమో అందరికి తెలియ‌జెప్పే ఆ ఫోటో ద్వారా చెప్పేస్తుంటాడు. నితిన్‌కు పవ‌ర్‌స్టార్‌పై ఎనలేని గౌరవాన్ని చూపే విధంగా ఆ ఫొటోను తన ఆఫీసు రూంలో పెట్టుకొన్నాడు. ఆఫీస్‌లోకి ప్రవేశించిన ప్రతీ ఒక్కరి కన్ను ఆ ఫొటోపై పడుతుంది.

గుండెల్లోనే కాదు.. ఆఫీసులో కూడా..

గుండెల్లోనే కాదు.. ఆఫీసులో కూడా..

పవన్, నితిన్ ఉన్న ఫొటోను చూస్తే ఎవరికైనా ఓ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. పవన్‌పై నితిన్‌కు ఉన్న అభిమానానికి నిలువెత్తు రూపం అని పలువురు పేర్కొంటారు. పవన్ అంటే అభిమానం కేవలం గుండెల్లోనే కాదు.. అంతటా ఉంటుందని మరోసారి నిరూపించాడు నితిన్.

English summary
Actors Pawan Kalyan, Nitin have special rapport. They respect each other. Nitin treat him like a god. He always keeps Pawan spirit high. One his fans present a painting which had Pawan, Nitin images. This Photo goes viral in internet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu