»   » నితిన్ 'అ..ఆ' సెట్స్ లో పవన్ కళ్యాణ్ (ఫొటో), ఎందుకొచ్చినట్లు?

నితిన్ 'అ..ఆ' సెట్స్ లో పవన్ కళ్యాణ్ (ఫొటో), ఎందుకొచ్చినట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ కు, పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న 'అ..ఆ' సెట్స్ కు వెళ్లి మరీ ఆయన్ను కలసి, కాస్సేపు ముచ్చటించారు. దాంతో ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న పవన్ కు వీరాభిమాని నితిన్..ఆనందంతో ఆ ఫొటోని తీసిన ట్విట్టర్ లో పెట్టేసారు.


ఈ ఫొటోలో మనకు పవన్, త్రివిక్రమ్ మాట్లాడుకుంటూంటే అక్కడున్న అందరూ క్యూరియాసిటీగా చూడటం గమనించవచ్చు. నితిన్ తనకు చాలా నెర్వస్ గా అనిపించిందని, పవన్ ఎదురుగా ఉండటం, చాలా ఎగ్లైటింగ్ ఫీలవుతున్నట్లు తెలియచేసారు.


పవన్ ..'అ..ఆ'సెట్స్ కు రావటం క్యాజువల్ విజిట్ లేదా...తన తదుపరి చిత్రం త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ తో చేయటానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి ఏమన్నా మాట్లాడదాం అనే వచ్చారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


పవన్ కళ్యాణ్ మాట్లాడతానంటే త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ ఆయన ఫామ్ హౌస్ కో లేక ఆఫీస్ దగ్గరకో వెళ్తారు. వాళ్లను తన వద్దకు రప్పించుకోవటం ఇష్టం లేక ప్రాజెక్టు కన్ఫర్మ్ చేయటానికి పవన్ ఇలా వచ్చాడంటున్నారు.


Pawan Kalyan on the sets of A..Aa!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'అ..ఆ'. 'అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' అనేది ఈ టైటిల్ కి ఉపశీర్షిక. నితిన్ సరసన అందాల భామ సమంత నటిస్తుండగా.. తమిళ భామ అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ చిత్రంలో నటిస్తోంది. ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.


ప్రముఖ సౌత్ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం ఈ సినిమాకు పని చేస్తున్నారు. కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.


English summary
Nitin tweeted: "POWERFUL guest on our sets last nite!!was very nervous excited n happy to perform in front of him". Pawan Kalyan took time to visit the sets of 'A..Aa' directed by his good friend Trivikram Srinivas and acted by his hardcore fan Nithin.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu