»   » 'సత్యాగ్రహి’కి ప్రీప్లాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్...!

'సత్యాగ్రహి’కి ప్రీప్లాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో 'సత్యాగ్రహి"అని చెప్పిన పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత ఆ పేరు తెరపైకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం 'సత్యాగ్రహి" చిత్రం ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాడట పవన్. ఈ చిత్రం క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతుందని, పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తాడని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం 'తీన్ మార్", గబ్బర్ సింగ్"చిత్రాల్లో పవన్ నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఇవి కాకుండా 'ది షాడో" పేరుతో ఓ సినిమా తెరకెక్కించేందుకు పవన్ సన్నామాలు చేస్తున్నాడు. మరి 'సత్యాగ్రహి" చిత్రంతో కథానాయికలుగా ఏ భామలను ఎంచుకుంటాడో..!

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపైనే 'గబ్బర్ సింగ్" చిత్రాన్ని రూపొందిస్తున్న పవన్, 'సత్యాగ్రహి"ని కూడా ఇదే బ్యానర్ పై నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. మొదట ఎఎం రత్నం వారి శ్రీ సూర్య బ్యానర్ లో చిత్రీకరించాలని అనుకొన్నారు. ఇప్పడు పవన్ తన సొంత బ్యానర్ లో చేయాలని డిసైడ్ అయిపోరనిపిస్తోంది. ఒకపక్క వస్తున్న మాటలు ప్రకారమైతే ఈ చిత్రాన్ని తన భార్య రేణుదేశాయ్ కి అప్పగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ చిత్రం ఎవరి చేతులు మీదుగా పూర్తయ్యి తెరపై కనిపిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

English summary
Power Star Pawan Kalyan seems to be on movie making spree suddenly! He has already Teen Maar movie ready for release in April. Pawan has signed for Shadow with Vishnuvardhan and it would go on floors from April. Also Gabbar Singh will be produced and acted by himself after summer. Now, along with these projects, he is said to be planning to restart his pet project Satyagrahi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu