»   » ఆలస్యం అయినా ‘పులి’ పులే....!

ఆలస్యం అయినా ‘పులి’ పులే....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ పని అయిపోయిందని అందరు అనుకుంటున్నారు, కాని ఒక్క సినిమా విడుదల ఆలస్యం అయినంత మాత్రానా అతని ఇమేజ్ డ్యామేజ్ కాదని ఫిల్మిం వర్గాల కథనం. ప్రస్తుతం అన్ని హంగులు పూర్తి చేసుకొన్న కొమరం 'పులి" విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలో పాటలు విడుదల కానున్నాయని సినీ నిర్మాత ఇప్పటికే వెల్లడించారు. ఒక్క వారంలోపు ఆడియో విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందాని మెగా బ్రదర్స్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ సినిమా విడుదల ఆలస్యం అయితే ఆకలితో ఉన్న అభిమానులు ఖచ్చితంగా పులులు అవుతారు.

నిర్మాత సింగనమల రమేష్ ఎంత ఖర్చుఅయినా సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే, సినిమా బాగా వచ్చేంత వరకూ ఆలస్యం అయినా పర్వాలేదని నిర్మాత, పవన్, దర్శకుడు ఎస్ జే సూర్య అంటున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకపోతే నేను దర్శకత్వమే చేపట్టనని నటుడుగా మిగిలిపోతానని సూర్య సంచలనమైన వ్యాక్యలు చేశారు. ఇంతకు ముందు సూర్య దర్శకత్వంలో తెలుగులో ప్రిన్స్ మహేష్ నటించిన 'నాని" అంతంత మాత్రంగానే ప్రేక్షాదరణ పొందింది. అయితే మహేష్ కి, సూర్యకి మంచి మార్కులే పడ్డాయి. ఆలస్యం అయినా పులి ఆకలితోనే ఉంటుంది కానీ గడ్డితినదని, చివరికి పంజావిసిరి తనకు కావలసిన ఆహారం తీసుకుంటుందనేది ఎంత నిజమో, పులి సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అవుతుందనేది అంతే నిజం అనేది సినిమా ఇండస్ట్రీ టాక్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu