»   » సంబరాల్లో పవన్ ఫ్యాన్స్: మరో మైలు రాయిని అందుకున్న పవర్‌స్టార్

సంబరాల్లో పవన్ ఫ్యాన్స్: మరో మైలు రాయిని అందుకున్న పవర్‌స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Fans In Full Celebrations..Know Why? సంబరాల్లో పవన్ ఫ్యాన్స్..

టాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటున్న సంగతి తెలిసిందే. లక్షలాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ అందుకోలేని రికార్డును కూడ నాగార్జున సొంతం చేసుకోవడం ఆ మధ్య టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్పుడు పవన్ కూడా ఆ మార్క్ ను అందుకున్నాడు. ట్విట్ట‌ర్‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న తెలుగు హీరోల్లో ప‌వ‌న్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. మొద‌టి స్థానంలో మ‌హేశ్ బాబు, రెండో స్థానంలో సిద్ధార్థ్‌, మూడో స్థానంలో రానా, నాలుగో స్థానంలో నాగార్జున ఉన్నారు.

ప్రధాన అస్త్రంగా సోషల్ మీడియా

ప్రధాన అస్త్రంగా సోషల్ మీడియా

స్టార్ హీరోగానే కాకుండా క్రియాశీలక రాజకీయాల్లోనూ తనదైన ముద్రను వేసేందుకు జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రధాన అస్త్రంగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాడు.ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చా... జనసేన పార్టీని స్థాపించా అని చెప్పే పవన్ కళ్యాణ్ తన ప్రశ్నల పరంపరకు ట్విట్టర్ ఖాతాను వేదికగా చేసుకున్న సంగతి తెలిసిందే.

ట్విట్టర్‌లోనే అందుబాటులో ఉంటాడు

ట్విట్టర్‌లోనే అందుబాటులో ఉంటాడు

నిజానికి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో కంటే ట్విట్టర్‌లోనే ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఒకర్ని పొగడాలన్నా.. మరొకర్ని తిట్టాలన్నా.. ప్రశ్నించాలన్నా.. సలహా ఇవ్వాలన్నా, చివరికి ప్రభుత్వాలపై, ప్రతిపక్షాలపైనా విరుచుకు పడాలన్నా, ప్రజా సమస్యలపై పబ్లిక్ మీటింగ్‌లపై పిలుపునివ్వాలన్నా. ట్విట్టర్‌నే వేదిక చేసుకుంటున్నాడు పవన్.

ఫాలోవ‌ర్ల సంఖ్య 20,07,899

ఫాలోవ‌ర్ల సంఖ్య 20,07,899

సోష‌ల్ మీడియా మాధ్య‌మం ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫాలోవ‌ర్ల సంఖ్య 20,07,899కి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా త‌న అభిమానుల‌కు ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. అదే ట్విటర్ వేదికగా అభిమానులనీ, జనసేన కార్యకర్తలనీ ఉద్దెశించి ట్వీట్ చేసాడు. తన వెనుక ఉన్న ప్రతీ ఒక్కరికీ కృతఙ్ఞతలు అంటూ చెప్పాడు.

దారంతా గోతులు, చేతిలో దీపం లేదు

దారంతా గోతులు, చేతిలో దీపం లేదు

`మూడేళ్ల క్రితం జ‌న‌సేన ప్ర‌యాణం మొద‌లు పెట్టిన‌పుడు... దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్య‌మే క‌వ‌చంగా.... ఒకే గొంతుక‌తో మొద‌లు పెట్టాను, నేను స్పందించిన ప్ర‌తి స‌మ‌స్య‌కి మేమున్నామంటూ ప్ర‌తిస్పందించి, ఈ రోజు ఇర‌వై ల‌క్ష‌ల దీపాల‌తో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిర‌స్సు వంచి కృత‌జ్ఞ‌త‌ల‌తో... మీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...` అని ట్వీట్ చేసాడు..

ఇదీ పవన్ స్టామినా

ఇదీ పవన్ స్టామినా

ఈ సందర్భంగా పవన్ భక్తుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇదీ పవన్ స్టామినా అంటూ ట్వీట్ చేశాడు. పవన్ ఈ ట్వీట్ చేసిన గంట‌లోనే దీనికి 6వేల‌కి పైగా లైకులు, 2500ల రీట్వీట్లు వ‌చ్చాయి. ఈ స్పీడ్ ఇప్పట్లో ఆగేలా లేదు మరింత ఫాస్ట్ గా పవన్ ఫాలోవర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ విషయం లో పవన్ కన్నా ఎక్కువగా అభిమానులే ఆనందపడుతున్నారు.

English summary
Power Star has entered the league of Tollywood stars who have more than 2 million followers on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu