»   » రాజకీయాల్లో....పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డ్!

రాజకీయాల్లో....పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'జనసేన' పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఓ విషయం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తన ఆటిట్యూడ్‌తో వరల్డ్ రికార్డ్ సాధించారని అంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే...

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పైగా ఇతర పార్టీల తరుపున ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లకు తన మద్దతు ప్రకటించారు. సినిమా తారల్లో పార్టీ స్థాపించిన తర్వాత ఇలా చేసిన వారు ప్రపంచంలో ఎవరూ లేక పోవడం వరల్డ్ర్ రికార్డే అంటున్నారు.

Pawan Kalyan Record as a Politician

కాగా...విశాఖపట్నం సభ తర్వాత పవన కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు. విశాఖలో జరిగిన సభ కాస్త చప్పగా మారిందన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇది తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దం లాంటిదని, ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత పవన్ కళ్యాణ్ తన తడాఖా చూపెట్టబోతున్నారని అంటున్నారు అభిమానులు. త్వరలో పవన్ మూడో సభ ఏర్పాటు చేయబోతున్నాడట.

మరోవైపు పవన్ కళ్యాణ్ తన 3వ సభ ద్వార బిజెపికి ప్రచారం చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెపుతున్నారు. దీనికి బలం చేకూర్చుతున్నట్లు పవన్ శనివారంనాడు తన అభిమానులతో సమావేశమవడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రచార వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

English summary
After launching the own political party 'Janasena', pawan kalyan decided to keep himself away from contesting in the elections. This could be the strange decision to some extent. However, reports are out that pawan kalyan maybe campaigning for BJP and the TDP for the general elections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu