For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్.. చించేసి ఉంటాడు?: ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూశారా?, ఆ పాట క్రేజ్ మామూలుగా లేదు..(పోటోలు)

  |
  పవన్..మాస్ సాంగ్ క్రేజ్ మామూలుగా లేదు..!

  పవన్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు ఎంతటి పండుగనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలో జాతర చేయడానికి యూత్ గ్యాంగ్స్ సిద్దమైపోతారు. తెరపై పవన్ చెప్పే ప్రతీ డైలాగ్ కు.. విజిల్స్.. కేకలు.. హంగామా.. అసలు మొదటి రోజు రచ్చ మామూలుగా ఉండదు.

  పవన్ సినిమాలో పాటేదైనా పూనకం వచ్చినట్లు స్టెప్పులేసే ఫ్యాన్స్.. ఇక స్వయంగా ఆయనే పాడితే ఇంకెంత రచ్చ చేస్తారో స్పెషల్‌గా చెప్పాలా?.. అజ్ఞాతవాసితో ఇప్పుడు ఆ రచ్చ మరోసారి రిపీట్ కాబోతోంది. పవన్ స్వయంగా మరోసారి తన గాత్రం సవరించడంతో.. అభిమానులు పండుగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

   ఆలస్యంగా రివీల్:

  ఆలస్యంగా రివీల్:

  తమ్ముడు... జానీ.. అత్తారింటికి దారేది.. కాటమరాయుడు.. ఇలా అడపాదడపా పాటలు కూడా పాడుతూ వస్తున్న పవన్.. అజ్ఞాతవాసిలోను పాట పాడారన్న సంగతి కాస్త ఆలస్యంగానే రివీల్ చేసింది చిత్ర యూనిట్. తాజా సమాచారం ప్రకారం 'కొడుకా.. కోటేశ్వరరావు..' అన్న పాటను పవన్ పాడినట్లు తెలుస్తోంది.

   అభిమానుల్లో జోష్:

  అభిమానుల్లో జోష్:

  అజ్ఞాతవాసిలో పవన్ పాట పాడారని తెలియగానే ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తెరపై ఆయన పాట ఎప్పుడెప్పుడు చూద్దామా?.. ఎప్పుడు స్టెప్పులేద్దామా? అన్న ఉత్సాహంలో ఉన్నారు.

   పిక్చరైజేషన్ ఎలా ఉంటుందో:

  పిక్చరైజేషన్ ఎలా ఉంటుందో:

  కాటమరాయుడులో పవన్ పాడిన పాటకు దాని పిక్చరైజేషన్ కూడా ప్లస్ అయింది. తెరపై ఆ పాటను అభిమానులు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. మరోసారి త్రివిక్రమ్ ఆ తరహాలో పిక్చరైజ్ చేసి ఉంటే.. థియేటర్లలో ఈ పాట మారుమోగడం ఖాయం.

   భాస్కర భట్ల లిరిక్స్:

  భాస్కర భట్ల లిరిక్స్:

  పవన్ పాటకు సంబంధించి చిత్ర యూనిట్ కొన్ని ఫోటోలు కూడా విడుదల చేసింది. ఆ ఫోటోల్లో గీత రచయిత భాస్కర భట్ల కూడా ఉన్నారు. అంటే.. పవన్ పాడిన పాట భాస్కర భట్ల కలం నుంచి వచ్చిందే అని అర్థమైపోతోంది. మరి పవన్ కోసం భాస్కర భట్ల ఎలాంటి హుషారెత్తించే లిరిక్స్ రాసి ఉంటారో!..

   పట్టుబట్టిన త్రివిక్రమ్ :

  పట్టుబట్టిన త్రివిక్రమ్ :

  అజ్ఞాతవాసిలో పవన్ తో పాట పాడించడం కోసం దర్శకుడు త్రివిక్రమ్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కూడా పాటకు ఓకె చెప్పినట్లు సమాచారం. ఫోటోల్లో పవన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే మరోసారి పాట ఇరగదీసినట్లే అనిపిస్తోంది.

  అమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనం

  క్లాసీ మ్యూజిక్:

  క్లాసీ మ్యూజిక్:

  పవన్ గత సినిమాల కన్నా అజ్ఞాతవాసి మ్యూజిక్ భిన్నంగా ఉందనే చెప్పాలి. గతంలోనూ పవన్ మూవీ ఆడియోల్లో క్లాసీ సాంగ్స్ ఉన్నప్పటికీ.. అజ్ఞాతవాసి ఆడియోలో వేరియేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

  పవన్ ఫ్యాన్స్‌కు ఆరోజు పండగే: బ్లాస్టింగ్ న్యూస్ చెప్పిన అజ్ఞాతవాసి టీమ్..

   మాస్ పాటే:

  మాస్ పాటే:

  పవన్‌తో పాట పాడించారంటే కచ్చితంగా మాస్ సాంగే అయి ఉంటుందన్న అంచనాలున్నాయి. తాజాగా 'కొడుకా.. కోటేశ్వరరావు..' అంటూ లిరిక్స్ లీక్ చేయడంతో.. ఇది కచ్చితంగా మాస్ సాంగే అన్న అభిప్రాయం బలపడింది.

  ఆయన అభిమానులను ఉర్రూతలూగించడానికే ఈ పాటను ప్రత్యేకంగా సిద్దం చేసి ఉంటారు. గతంలోనూ పవన్ మాస్ పాటలనే పాడటం.. తాజా అజ్ఞాతవాసి ఆడియోలో అన్నీ క్లాస్ సాంగ్సే ఉండటంతో.. పవన్‌తో మరోసారి మాస్ సాంగ్ పాడించారనుకోవచ్చు.

   డిసెంబర్ 31న:

  డిసెంబర్ 31న:

  డిసెంబర్ 31వ తేదీ రాత్రి న్యూ ఇయర్ కానుకగా ఈ పాటను విడుదల చేయనుంది చిత్రయూనిట్. నిజానికి తొలి నుంచి దీనిపై సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చిన చిత్ర యూనిట్.. పవన్ సాంగ్ ఉందని ప్రకటించి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది.

   ట్రైలర్ రిలీజ్:

  ట్రైలర్ రిలీజ్:

  అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో ట్రైలర్ రిలీజ్ చేస్తారని భావించినప్పటికీ.. కేవలం పాటలతోనే సరిపెట్టేశారు.డిసెంబర్ 26న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అభిమానులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

   అంచనాలు:

  అంచనాలు:

  సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత కాస్త నిరాశలో ఉన్న పవన్ ఫ్యాన్స్ కు అజ్ఞాతవాసి ఆ లోటును తీర్చేలా కనిపిస్తోంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉంటాయని త్రివిక్రమ్ ఇప్పటికే చెప్పేశారు. ఎప్పటిలాగే పవన్ క్యారెక్టరైజేషన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోవచ్చు. పవన్ ను కొత్తగా చూపించడానికి త్రివిక్రమ్ ఎలాంటి మాయ చేశాడో.. తెలియాలంటే జనవరి 10వరకు ఆగాల్సిందే.

  English summary
  A special song featuring Pawan Kalyan’s voice will be recorded soon and released as a New Year gift for the actor’s fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X