twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ పరిస్థితికి కారణం అదే: రేణు దేశాయ్ మరిచిపోలేని జ్ఞాపకం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె పవన్ తో విడిపోయి పూణెలో ఉంటున్నారు. పవర్ స్టార్ భార్యగా ఆమె ప్రయాణం మొదలై ఇద్దరు పిల్లలతో ఇంత వరకు వచ్చిందటే ఇందుకు 16 సంవత్సరాల క్రితమే బీజం పడింది. పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడటం, ఆయన్ను పెళ్లి చేసుకోవడం, ఇద్దరు పిల్లలకు తల్లవ్వడం, ఇపుడు ఆయనతో విడిపోయి పూణెలో ఉండటం లాంటివి జరిగాయింటే కారణం 'బద్రి' మూవీ. 2000 ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా వల్లే పవన్ కళ్యాణ్ తో ఆమెకు పరిచయం ఏర్పడటం, పవన్ కళ్యాణ్ జీవితంలోకి ఆమె ప్రవేశించడం జరిగింది.

    హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్....ఈ రంగంలో ఎదగాలని ఎన్నో కలలు కంది. 'బద్రి' సినిమాకు సైన్ చేసే సమయంలో ఆమె ఊహించి ఉండక పోవచ్చు...ఈ సినిమాతోనే నటిగా తన కెరీర్‌కు ముగింపు మొదలవుతుందని. పవన్‌తో ఆమె పరిచయం ప్రేమగా మారింది...పవన్ కళ్యాణే లోకంగా జీవించడం మొదలు పెట్టింది. పవన్ పరిచయం తర్వాత ఆమె ఇతర హీరోలతో, ఇతర చిత్రాల్లో నటించడానికి ప్రయత్నం చేయలేదు. బద్రి తర్వాత ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన 'జానీ'.

    ఏప్రిల్ 20వ తేదీ వచ్చినప్పుడల్లా రేణు దేశాయ్....తన జీవితం జ్ఞాపకాల్లోకి వెళ్లి పోతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్.... గతేడాది ఇదే రోజు తన బద్రి సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పుడు మీడియాలో అది చర్చనీయాంశం అయింది. అందుకే కాబోలు ఈరోజు ఆమె బద్రి గురించి ఎలాంటి జ్ఞాపకాలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేదు.

    ఇక నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. ఆమె సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాలా ఏక్టివ్ గాఉంటారు. అయితే వాటిల్లో ఎక్కడా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఉండదు. పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు.

    మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో దేశాయ్ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

    స్లైడ్ షోలో ఫోటోస్...

    బద్రి

    బద్రి


    ‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

    ఇపుడు

    ఇపుడు


    పవన్‌కల్యాణ్‌ నుంచి విడిపోయాక పూణేలో నివాసం ఉంటున్న రేణుదేశాయ్‌ సొంత పరిశ్రమ మరాఠీలో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.

    రేణు దేశాయ్

    రేణు దేశాయ్


    రేణు దేశాయ్...ఈ పేరు తెలుగు నాట ఇన్నాళ్ళూ పవన్ భార్యగా...ఓ నటిగానే తెలుసు. ఇప్పుడు ఓ దర్శకురాలిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.

    తెలుగుదనం

    తెలుగుదనం


    తెలుగింటి కోడలిగా అడుగుపెట్టి... ఆ తరవాత తిరిగి పుట్టినింటికే చేరినా, అప్పుడూ ఇప్పుడూ తెలుగుదనానికి దూరం కాలేదంటోంది రేణుదేశాయ్‌. ఆమె ఇటీవల ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవడమే ఇందుకు నిదర్వనం.

    తల్లిగా..

    తల్లిగా..


    మోడల్‌గా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విభిన్న పాత్రల్లో ఇమిడిపోయిన రేణు తల్లిగానూ తన పాత్రనూ సమర్థంగా నిర్వహిస్తోంది.

    నిరాడంబరంగా

    నిరాడంబరంగా


    కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్య ముచ్చట్లను మనతో పంచుకుంటోంది. వారి పోలికలు. వారి బుద్దలు గురించి తల్లిగా మురిసిపోతూ చెప్పుకొస్తోంది. తమకు ఆడంబరాలు అంటే గిట్టవని చెప్తోంది. అదే తమ పిల్లలకూ నేర్పుతున్నామంటోంది.

    సమన్వయం

    సమన్వయం


    రేణు మాట్లాడుతూ... ఏ బాధ్యతల్ని నిర్వర్తించినా వాటిని సమన్వయం చేసుకోవడంలోనే ఉంది కిటుకు. పనితో పాటూ పిల్లల బాధ్యతల్ని సమన్వయం చేసుకోవడం కష్టమే. కానీ వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్ని పక్కాగా సమన్వయం చేసుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం అన్నది నా నమ్మకం. అందుకే పనిలో ఎంత బాధ్యతగా ఉంటానో, పిల్లలకు తగిన సమయం కేటాయించడంలోనూ అదే విధంగా వ్యవహరిస్తాను అంటుంటారు.

    మనోధైర్యంతో ముందుకు

    మనోధైర్యంతో ముందుకు


    అలాగే...జీవితం ఎవరికి వారు నిర్ఱయించుకున్నట్టు జరగకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను స్వీకరిస్తూ, సరికొత్త లక్ష్యాలను నిర్ణయించుకుంటూ వెళ్లినప్పుడే ఆనందంగా ఉండగలం. అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలం అని చెప్తున్నారామె.

    English summary
    Badri is a 2000 Telugu, action drama film produced by T. Trivikrama Rao on Vijaya Lakhshmi Movies banner, directed by Puri Jagannadh. Starring Pawan Kalyan, Amisha Patel, Renu Desai in the lead roles and music composed by Ramana Gogula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X