»   » పవన్ కళ్యాణే... దాసరి నారాయణరావును రిక్వెస్ట్ చేసాడు!

పవన్ కళ్యాణే... దాసరి నారాయణరావును రిక్వెస్ట్ చేసాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో దాసరి నారాయణరావుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ఆయన దర్శకుడిగా కాకుండా కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. తన సొంతబేనర్ తారకప్రభు పిల్మ్స్ పతాకంపై దాసరి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తన 70వ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రముఖ పత్రికతో దాసరి నారాయణరావు పవన్ సినిమా గురించి మాట్లాడుతూ...పవన్ కళ్యాణే స్వయంగా వచ్చి తన దర్శకత్వంలో చేస్తానని అడిగాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్, అతని సినిమాలు చూసే ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని నేను దర్శకత్వం చేయడం సరికాదని నిర్ణయించుకున్నాను. కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటానన్నాను' అన్నారు.

Pawan Kalyan Requests Dasari To Direct His Next

ఈనాటి తరానికి ఏదో కావాలి. నాబోటి వాడు ఇంకేదో ఇస్తానంటాడు. 'ఎర్రబస్సు' చూశారుగా. నిజంగా చాలా మంచి సినిమా. 'ఈ సినిమాలో ఫలానా తప్పు ఉంది..' అని ఎవరినైనా చెప్పమనండి. పోనీ నటీనటులు బాగోలేరా? వూరూపేరూ లేనివాళ్లతో కూడా నేను సినిమాలు చేశాను కదా.? నా ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లకు రావడం లేదు. వాళ్లు ఇంటికే పరిమితమైపోయారు. వెటకారపు వినోదాన్ని ఇష్టపడేవాళ్లు ఇప్పుడు సినిమాలకొస్తున్నారు. వాళ్లకు ఐటెమ్‌ పాట కావాలి. అలాంటి సినిమాల్ని నేను చేయలేను. ఒకవేళ నేనే దర్శకత్వం వహిస్తే.. అందులో సందేశాలు ఉంటాయి. అవి జనాలకు ఎక్కవు" అని దాసరి నారాయణరావు చెప్పుకొచ్చారు.

‘ప్రస్తుతం పవన్‌కల్యాణ్ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. బయటి కథల్ని కూడా వింటున్నాను. దర్శకుడెవరనేది ఇంకా నిర్ణయం కాలేదు. కథ ఫైనలైజ్ కాగానే అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఈ ఏడాదే ఆ సినిమా సెట్స్‌పైకి వస్తుంది. సందేశాత్మక కథను ఎంచుకోవాలా? లేదా వినోదప్రధాన ఇతివృత్తంతో సినిమా తీయాలా? అనే విషయంలో కొంత సందిగ్ధత వుంది. ఎలాంటి సినిమా తీసినా పవన్‌కల్యాణ్ స్టైల్, ఇమేజ్‌కు అనుగుణంగానే వుంటుంది' అన్నారు.

English summary
It is known that Pawan Kalyan's next movie has been confirmed with the veteran director Dasari Narayana Rao. In the past, the legend has also made it clear that he is not directing the film, instead, he is just going to produce it under his banner, Tarak Prabhu Films.
Please Wait while comments are loading...