For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అజ్ఞాతవాసి కథ ఇదేనట.. సోషల్ మీడియాలో హల్‌చల్.. పవన్, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్

  By Rajababu
  |
  అజ్ఞాతవాసి కథ ఇదేనట..! | Filmibeat Telugu

  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అంటే అదో సెన్సేషన్. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు వారిద్దరి స్టామినాకు అద్దం పట్టాయి. తాజాగా అజ్ఞాతవాసి చిత్రంతో మూడోసారి జతకట్టిన పవన్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ విజయానికి సిద్ధమవయ్యారు. అయితే అజ్ఞాతవాసి చిత్రానికి సంబంధించిన కథ ఇదేనంటూ..సోషల్ మీడియాలో ఓ స్టోరి హల్‌చల్ చేస్తున్నది. ఇంతకు అదేనా అజ్ఞాతవాసి కథ అంటూ ఆసక్తి పెరుగుతున్నది.

  ఇంతకీ కథ ఏమిటంటే

  ఇంతకీ కథ ఏమిటంటే

  ఓ సంపన్నుడికి ఇద్దరు భార్యలు ఉంటారు. ప్రత్యర్థుల కుట్రలో ఆ సంపన్నుడు ప్రాణాలు కోల్పోతాడు. వెలకట్టలేని సంపన్నుడి ఆస్తి కాజేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మొదటి భార్యకు ఓ కొడుకు ఉంటాడు. ఆస్తి మొత్తం అతడి పేరిటే ఉంటుంది అనే విషయం వెలుగు చూస్తుంది.

   అజ్ఞాతవాసంలోని కొడుకు కోసం

  అజ్ఞాతవాసంలోని కొడుకు కోసం

  కొడుకు పేరిటనే సంపద ఉంది అని సంపన్నుడి రెండో భార్య తెలుసుకొంటుంది. అజ్ఞాతవాసంలో ఉన్న కొడుకు గురించి తల్లి వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అజ్ఞాతవాసంలో ఉన్న కొడుకును తల్లి కలిసిందా? కొడుకు అజ్ఞాతవాసిగా ఎందుకు మారాడు. తల్లి, కొడుకులు కలిసిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది. తండ్రికి జరిగిన అన్యాయాన్ని కొడుకు ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే అజ్ఞాతవాసి కథ అంటున్నారు.

  అజ్ఞాతవాసిగా పవన్

  అజ్ఞాతవాసిగా పవన్

  కొడుకుగా పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి టైటిల్ పాత్రను పోషించగా, తల్లిగా సీనియర్ నటి కుష్భూ, తండ్రిగా బోమన్ ఇరానీ నటించినట్టు సమాచారం. పవన్ సరసన అను ఇమ్యాన్యూయేల్, కీర్తి సురేష్ నటించారు. నటన పరంగా పవన్ దుమ్ము రేపినట్టు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని పాటలకు మంచి స్పందన కనిపిస్తున్నది.

   జనవరి 10న విడుదల

  జనవరి 10న విడుదల

  ఇటీవలే ఈ చిత్రం వారణాసిలో టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకొన్నది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకొంటూ జనవరి 10న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం రూపొందిందనే ఇన్‌సైడ్ టాక్ ఫ్యాన్స్ సంతోషంలో ముంచెత్తుతున్నది.

   పవర్‌ఫుల్ స్క్రీన్ ప్లేతో

  పవర్‌ఫుల్ స్క్రీన్ ప్లేతో

  పవన్, త్రివిక్రమ్ స్టామినాకు ఏ మాత్రం తగ్గకుండా పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లేతో అజ్ఞాతవాసి రూపుదిద్దుకొన్నట్టు సమాచారం. సినీ ప్రేక్షకులకు దిమ్మతిరిగే విధంగా సినిమా ఉంటుంది అని చిత్ర యూనిట్ పేర్కొంటున్నది. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఎమోషన్స్ పక్కగా తెరకెక్కించినట్టు తెలిసింది.

  త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్

  త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్

  త్రివిక్రమ్ తరహా మాటలు, పవన్ ఎనర్జీకి తగినట్టుగా ఫైట్స్‌ ప్రేక్షకులను పిచ్చెక్కించడం ఖాయమట. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో రికార్డులు తిరగరాయడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. మరోసారి వీరి కాంబినేషన్ హైలెట్‌గా నిలుస్తుందనేది ఇన్‌సైడ్ టాక్.

   అజ్ఞాతవాసి ఆడియోకు చిరంజీవి

  అజ్ఞాతవాసి ఆడియోకు చిరంజీవి

  కాగా హైదరాబాద్ హైటెక్స్‌లో 'అజ్ఞాతవాసి' ఆడియోను భారీఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఆడియో వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నాడనే వార్త మరింత క్రేజ్ పెంచింది. అజ్ఞాతవాసి కారణంగా మరోసారి మెగా బ్రదర్స్ ఒకే వేదికపైన కనిపించనున్నారట.

   చిరుపై పవన్ సానుకూలం

  చిరుపై పవన్ సానుకూలం

  ప్రస్తుతం జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ రాజకీయాలపై దృష్టిపెట్టి ఏపీలో పర్యటిస్తున్నాడు. ఇటీవల తన ప్రసంగాల్లో చిరంజీవికి ద్రోహం తలపెట్టిన వారిని వదిలిపెట్టం అని పవన్ సానుకూలంగా స్పందించడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

  బయోమెట్రిక్ పాసులు

  బయోమెట్రిక్ పాసులు

  ఇదిలా ఉండగా, అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులకు, ప్రేక్షకులకు బయోమెట్రిక్ పాసులను ఇచ్చే పనిలో ఉన్నట్టు సమాచారం. ఓ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ ఫంక్షన్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

   85 లక్షలకు ప్రసార హక్కులు

  85 లక్షలకు ప్రసార హక్కులు

  కాగా అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రసారం చేసే హక్కులను ఓ ప్రముఖ టెలివిజన్ చానెల్ సొంతం చేసుకొన్నది. ఈ హక్కుల కోసం సదరు టీవీ చానెల్ యాజమాన్యం రూ.85 లక్షలు చెల్లించినట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి చిత్రంలో నటించిన నటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు.

  English summary
  Pawan Kalyan's Agnathavasi story viral in social media. This movie story is quiet interesting. This movie set to release on January 2018. Meanwhile, huge preparatons are for Agnathavasi audio is on card.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X