For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ క్రేజ్: తలకెక్కిన అభిమానం, కోసుకున్న నితిన్?

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అంటే క్రేజ్ ఎలా ఉందంటే....ఆయనకు ఉన్నది అభిమానులు కాదు, భక్తులు అనేంతగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో ‘గోపాల గోపాల' చిత్రం విడుదలైన తర్వాత ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వెండితెరపై దేవుడిగా దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్‌కి థియేటర్లోనే కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు అభిమానులు.

  ఆయనంటే ఎంత అభిమానమో చాటు కోవడానికి ఏకంగా గుండుపై ‘గోపాల గోపాల' టైటిల్, పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చేలా హెయిర్ కట్ చేయించుకున్నాడు ఓ అభిమాని. ఆ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు నితిన్ లాంటి యంగ్ హీరోలు సైతం ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని డెమీ గాడ్ గా కొలిచేవారిలో యువహీరో నితిన్ ముందువరుసలో వుంటాడు.

  pawan kalyan's fans said 'Pawan Kalyan is a God'

  పవన్‌ని తెరపై దేవుడి రూపంలో చూడగానే నితిన్ వేలుకు కోసుకుని ఆ రక్తంతో పవన్‌కి తిలకం దిద్దినట్టు సమాచారం. ఇంత కాలం నితిన్ పవన్ కళ్యాణ్ జపం జపిస్తున్నాడంటే....తన సినిమాలకు పబ్లిసిటీ తేవడానికే అని అంతా అనుకున్నారు. కానీ అతనిలో నిజమైన అభిమానం ఉందని ఈ సంఘటన రుజువు చేస్తోందని తోటి ఫ్యాన్స్ అంటున్నారు.

  ఇక పవన్ కళ్యాణ్‌పై అభిమానులు చూపిస్తున్న అభిమానం చూసి ఆశ్చర్య పోయిన రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు...ట్విట్టర్లో తమ చేతికి పని పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల రోజే చిరంజవి 150వ సినిమా విడుదలైతే పరిస్థితి ఏమిటనే అనుమానం వచ్చింది వర్మకు. నిజంగా పవన్ కళ్యాణ్‌ ఫాలోయింగును చూస్తే హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుండి దూకేస్తాడు అంటూ వర్మ ట్వీట్ చేసాడు.

  అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈచిత్రం బాగా ఆడుతోంది. చెన్నై బాక్సాఫీసు వద్ద కూడా దుమ్ము రేపుతోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. గోపాల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.

  మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

  English summary
  Tollywood power star Pawan Kalyan's fans said 'Pawan Kalyan is a God'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X