»   » నచ్చేసి, మెచ్చేసుకుంటున్నారు: గోవుల మధ్య గోపాలుడులా.. (పవన్ కొత్త ఫొటో)

నచ్చేసి, మెచ్చేసుకుంటున్నారు: గోవుల మధ్య గోపాలుడులా.. (పవన్ కొత్త ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా స్క్రిప్టు కోసం డిస్కషన్ కు ఫామ్ హౌస్ కు వెళితే అక్కడ గోవుల మధ్య గోపాలుడులా పవన్ కళ్యాణ్ కనిపించారంటూ మురిసిపోతూ ఆయన మిత్రుడు శరద్ మరార్ రాసుకొచ్చి, అప్పుడు క్లిక్ మనిపించిన ఫొటోను అభిమానుల కోసం షేర్ చేసారు. ఆ ఫొటోను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడీ ఫొటో పవన్ అభిమానులను తెగ అలరిస్తోంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షేర్లు అవటం మొదలెట్టింది.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రాల విషయానికి వస్తే...శరద్ మరార్ నిర్మాతగా డాలీ దర్శకత్వంలో ఓ చిత్రం ఈ మధ్యనే ప్రకటించారు. ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా ఎస్ జె సూర్యను ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో గోపాల గోపాల దర్శకుడు డాలీని తీసుకొని షూటింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు.

అయితే ఈ చిత్రం గురించి ఆ మధ్యన చిత్రయూనిట్ నుంచి బయటకు రాకముందే సినిమా విశేషాలను తెలియజేస్తూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు ఎస్ జె సూర్య. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు వందకోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టు తెలిపారు.

సినిమాలో పవన్ రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా నటిస్తున్నారని, సినిమా అంతా పంచెకట్టులోనే ఉంటారని తెలిపారు. అయితే తనకు రాయలసీమ ప్రాంతంపై అవగాహన లేని కారణంగా కథాకథనంలో ఆకుల శివ సహాయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజులకే సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మరి ప్రస్తుత దర్శకుడు డాలీ, సూర్య ప్లాన్ చేసిన దానికన్నా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

English summary
Sharrath marar tweeted: "Went to the farm to discuss film only to find our 'Gopala' in the midst of nature with cows all around.#PawanKalyan"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu