నేడు అందుకేనా? పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోస్)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్నేహితుడు, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర నిర్మాత శరత్ మారార్ నిర్మిస్తున్నారు.
ఈ రోజు ఉదయం నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్ ఆఫీసులో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరింగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సుధాకర్ రెడ్డి క్లాప్ కొట్టారు. గౌతం రాజు కెమెరా స్విచాన్ చేసారు. ఎస్.జె.సూర్య తొలి సన్నివేశాన్నిడైరెక్టర్ చేసారు.
ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్రారంభిస్తారనే ప్రచారం జరిగింది. అయితే పవన్-ఎస్.జె.సూర్య కాంబినేషన్లో వచ్చిన 'ఖుషి’ చిత్రం రిలీజై నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తి కావడం, ముహూర్తం కూడా కలిసి రావడంతో ఈరోజే ప్రారంభించారట.
ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఓ ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య గతంలో రెండు సినిమాలకు కలిసి పని చేసారు. అందులో ఒకటి 'ఖుషి' భారీ బ్లాక్ బస్టర్ కాగా, కొమురంపులి భారీ ప్లాపుగా నిలిచింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి మూడో సినిమా మొదలు పెట్టారు.
ఈ సినిమా కోసం గత కొంతకాలంగా దర్శకుడు ఎస్.జె.సూర్య గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. రచయిత ఆకుల శివతో కలిసి దాదాపు 4 నెలలు సిటింగ్స్ వేసి స్టోరీ డెవలప్ చేసారు. చివరకు పవన్ కళ్యాణ్ మెచ్చే విధంగా, ఆయనకు సూటయ్యే స్టోరీని రెడీ చేసారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
గోపాల గోపాల సినిమా సమయంలో అనూప్ రూబెన్స్ కు మరో అవకాశం ఇస్తానని మాటిచ్చాడు పవన్. ఈ మేరకు ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ ను పవన్ కళ్యాణ్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు. బిల్లా, బెంగాల్ టైగర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సౌందర్ రాజన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

పవన్, సూర్య
సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, సూర్య

టెక్నీషియలన్లు
ఎడిటర్ గా గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్ గా బ్రహ్మ కడలి, ఫైట్ మాస్టర్లుగా రామ్-లక్ష్మణ్ ఎంపికయ్యారు.

స్టోరీ
స్టోరీ-డైలాగులు ఆకుల శివ అందించగా, స్క్రీన్ ప్లే-డైరెక్షన్ ఎస్.జె.సూర్య హ్యాండిల్ చేస్తున్నారు.

రెగ్యులర్ షూటింగ్
జూన్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ రోజు ప్రారంభించడానికి
కారణం పవన్, సూర్య కాంబినేషన్లో వచ్చిన ఖుషి చిత్రం విడుదలై సరిగ్గా 15 సంవత్సరాలు పూర్తి కావడమే. ఏప్రిల్ 27, 2011న ఖుషి రిలీజైంది.

ఖుషి రేంజిలో...
ఈ చిత్రం ఖుషి చిత్రానికి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది.

త్వరలో పూర్తి వివరాలు
సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాత శరత్ మరార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











