For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ న్యూస్ : పాట పాడిన పవన్ కళ్యాణ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తన గొంతుతో పాడిన పాటని వెండితెరపై వినబోతున్నామా..అవుననే అంటున్నాయి..సినీ వర్గాలు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం పవన్ గొంతు సవరించుకోబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ మేరకు ఆయన సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉన్న ప్రెవేట్ స్టూడియో కు వెళ్లారని చెప్తున్నారు. అయితే ఈ వార్త నిజమా కాదా అన్నది ఆడియో విడుదల అయితే కానీ తెలియదు.

  ఇక పవన్ కళ్యాణ్ పాడిన పాటను పవన్ కళ్యాణ్, మిగతా కీ ఆర్టిస్టులపై కొద్ది రోజుల క్రితమే చిత్రీకరించారని సమాచారం. ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలని నిర్ణయించుకున్నారని చెప్తున్నారు. ఈ చిత్రం టాకీ పార్ట్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

  రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

  మరో ప్రక్క సినిమా రిలీజ్‌ డేట్‌ ఖరారైనా....సినిమా టైటిల్‌పై మాత్రం దర్శక, నిర్మాతలు ఇంకా సస్పెన్స్‌ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్‌నగర్‌ నుంచి అందుతున్న వార్తల ప్రకారం ఈ సస్పెన్స్‌ వీడినట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న 'అత్తారింటికి దారేది' అనే టైటిలే ఈ చిత్రానికి ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఇటీవల ఈ టైటిల్‌ను ఫిల్మ్‌ఛాంబర్లో రిజిస్టర్‌ చేయించడమే ఇందుకు నిదర్శనం.

  ఈ సందర్భంగా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ...'మా బేనర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ స్టైల్ లో ఉంటూనే త్రివిక్రమ్ మార్క్‌తో ఎంతో వైవిద్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తాము. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము' అన్నారు.

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మన్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

  English summary
  
 If sources are to be believed, actor Pawan Kalyan is all set to get into the recording room once again and lend his vocals to a song from his forthcoming film, directed by Trivikram Srinivas.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X