»   » ఈసారి పవన్ ‘పోతురాజు ’ అంటూ చెలరేగిపోతాడు!

ఈసారి పవన్ ‘పోతురాజు ’ అంటూ చెలరేగిపోతాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించ అంశాల్లో పవన్ స్వయంగా పాడే కొన్ని బిట్ సాంగ్స్. పవన్ కళ్యాణ్ తొలిసారిగా 'తమ్ముడు' చిత్రం పాడిన సాంగ్ 'తాటి చెట్టెక్కలేవు' అంటూ పాడిన బిట్ సాంగ్ అప్పట్లో చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో పవన్ కళ్యాణ్ బిట్ సాంగ్స్ పాడారు.

పవన్ కళ్యాణ్ గత సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రంలో కూడా 'కాటము రాయుడా' అంటూ పాడిన బిట్ సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ బిట్ సాంగ్ పాడబోతున్నట్లు సమాచారం. ఇందులో 'పోతురాజు పోతురాజు' అంటూ పవన్ పాట సాగుతుందని సమాచారం.

'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం వెనక అసలు కారణం అదనట. ఏప్రిల్ 8వ తేదీన తెలుగు, హిందీలో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో వివిధ విభాగాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ సినిమాకు ఆయన స్క్రిప్టు అందించడంతో పాటు హీరోగా, నిర్మాతగా ఇలా మల్టిపుల్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే పెద్ద హిట్టవుతుందని అంటున్నారు.

స్లైడ్ షోలో పవన్ కళ్యాణ్ గత సినిమాల్లో పాడిన బిట్ సాంగ్స్ వివరాలు...

rn

తమ్ముడు మూవీలో


తాటిచెట్టెక్కలేవు తాటి కల్లు తీయలేవు..
ఈత చెట్టెక్కలేవు ఈతకల్లు తీయలేవు..
మల్లి...అరె మల్లి నీకెందుకు పెళ్లి అంటూ పవన్ పాడారు.

ఖుషీ మూవీలో


బైబైయ్యే బంగారు రమణమ్మ..
బాయి చెరువుకాడ బోరింగ్ రమణమ్మ
అటు బ‌స్సూ... ఇటు బ‌స్సూ...
న‌డుమ‌ల బ‌స్సులోన మ‌న‌మెళ్దాం ర‌మ‌ణ‌మ్మ‌ అంటూ పవన్ పాడారు

జానీ..


నువ్వు సారా తాగమాకురన్నో అనే సాగుతో పాటు రావోయి మా కంట్రీకి అనే సాంగు పవన్ కళ్యాణ్ పాట పాడారు.

గుడుంబా శంకర్


కిళ్లి కిళ్లి అంటూ పవన్ కళ్యాన్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పంజాలో..


పంజా చిత్రంలో పాపారాయుడు అంటూ పవన్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

rn

అత్తారింటికి దారేది..


అత్తారింటికి దారేది చిత్రంలో కాటము రాయుడా సాంగ్ పాడారు.

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్


సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పోతురాజ పోతురాజు అంటూ సాంగ్ సాగుతుందని తెలుస్తోంది.

English summary
Pawan Kalyan has reportedly lent his voice for a bit song in the Sardaar Gabbar Singh, which goes like 'Pothuraju Pothuraju..'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu