»   »  ఇదేం గోల: బాహుబలికి పవన్ కళ్యాణ్ తలనొప్పిగా మారాడా?

ఇదేం గోల: బాహుబలికి పవన్ కళ్యాణ్ తలనొప్పిగా మారాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు, బాహుబలి సినిమాకు అసలు సంబంధం ఏమిటి? అసలు లేనే లేదు. కానీ ఇపుడు బాహుబలి టీంకు ఆయన ఓ తలనొప్పిగా మారాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కారణం పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న హడావుడే అని ఫిల్మ్ నగర్ టాక్.

ఇటీవల తిరుపతిలో జరిగిన ‘బాహుబలి' ఆడియో వేడుకలో ఆ చిత్రంలో నటించిన అడవి శేష్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ‘పంజా' సినిమా ద్వారా నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసారు. ఆయన అప్పుడు నన్ను పరిచయం చయడం వల్లే ఇపుడు బాహుబలి సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆయనకు థాంక్స్ అంటూ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ పేరు అడవి శేష్ నోటి వెంట రాగానే....ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన వారంతా ఈలలు విజిల్స్ వేస్తూ గోల చేస్తూ భారీగా రెస్పాండ్ అయ్యారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సినిమా రంగానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా పవన్ కళ్యాణ్ పేరు వినబడగానే రెస్పాన్స్ ఇలానే ఉంటుంది.

బాహుబలి

బాహుబలి


బాహుబలి ఆడియో వేడుకపై సోషల్ మీడియాలో ఈ దృశ్యం తెగ సర్క్యులేట్ అవుతుంది.

ఫేస్ బుక్ లో...

ఫేస్ బుక్ లో...


ఫేస్ బుక్ లో బాహుబలి సినిమాపై ఇలాంటివి దర్శనమిస్తున్నాయి.

యూట్యుబ్

యూట్యుబ్


అడవిశేష్, ప్రభాస్ స్పీచ్ వీడియోలపై పోలిక.

ఫ్యాన్స్

ఫ్యాన్స్


పవన్ కళ్యాణ్ అభిమానుల విశ్లేషణ ఇలా...

అభిమానులు

అభిమానులు


ఇవన్నీ అభిమానులు క్రియేట్ చేసినవే అని అంటున్నారు

మరో వైపు యూట్యూబులో కూడా.... ఆడియో వేడుకలో ప్రభాస్ మాట్లాడిన వీడియో కంటే అడవి శేష్ పవన్ కళ్యాన్ గురించి మాట్లాడిన వీడియోకే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఈ పరిణామాలన్నీ ప్రభాస్ అభిమానులకు చిరాకు తెప్పిస్తున్నాయని టాక్.

English summary
It is known that Bollywood Super Star Salman Khan and Kollywood Star Hero Suriya have come out of their shell and requested their fans to be cordial to other heroes and fans too. They have asked their own followers not to get in to any fan wars since all the heroes in the film industry are good friends infact. Looks like, it's high time for Pawan Kalyan also to make a statement of that sorts to end these silly fan wars. During the audio launch of Baahubali, Adivi Sesh, who was introduced to films with Pawan Kalyan's Panja, thanked the star for bringing him into the industry.
Please Wait while comments are loading...