»   » జనసేన ‘దేశ్ బచావో’ ఆల్బం వెనక 19 ఏళ్ల కుర్రాడు, ఆశ్చర్యకర విషయాలు!

జనసేన ‘దేశ్ బచావో’ ఆల్బం వెనక 19 ఏళ్ల కుర్రాడు, ఆశ్చర్యకర విషయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్న 'జనసేన' పార్టీ ఏపీ ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో జరిగిన మెరీనా బీచ్ జల్లికట్టు ఉద్యమం తరహాలో ఏపీలో ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ యువత సిద్ధం అవుతున్న వేళ వారిలో చైతన్యం నింపేందుకు జనసేన పార్టీ 'దేశ్ బచావో' పేరుతో మూడు పాటలతో కూడిన ఆల్బం రిలీజ్ చేసింది.

ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొనేలా ఉద్యమ స్ఫూర్తిని రగుస్తున్న ఈ పాటల రూపకలప్పన వెనక ఓ 19 ఏళ్ల కుర్రాడు ఉన్నాడంటే నమ్మగలరా? అతని పేరే డీజే పృథ్వీ సాయి. ఆసియాలోనే అతిపిన్న వయస్కుడైన డీజేగా పృథ్వీ చరిత్రకెక్కాడు. తనకు 10 ఏళ్ల వయసప్పుడు 2008లో పృథ్వీ డీజే రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పుడే 100 పాటలను 3 గంటలపాటు నాన్‌స్టాప్‌గా మిక్సింగ్ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

పవన్ కళ్యాణ్ ద్వారా మరింత పాపులర్

పవన్ కళ్యాణ్ ద్వారా మరింత పాపులర్

డీజే పృథ్వీ సాయి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నా.... చాలా మంది తెలుగువారికి అతడి గురించి తెలియదు. అతడి గురించి పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఇపుడు అతడో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు.

అతిపిన్న వయస్కుడైన డీజే

ఆసియాలోనే అతిపిన్న వయస్కుడైన డీజేగా పృథ్వీ చరిత్రకెక్కాడు. తనకు 10 ఏళ్ల వయసప్పుడు 2008లో పృథ్వీ డీజే రంగంలోకి అడుగుపెట్టాడు.

సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించాడు

ఈ కుర్రాడు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ సంగీత్ సీన్లో డీజేగా కూడా నటించాడు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడిస్తూ ట్వీట్ చేసారు.

అంతర్జాతీయ స్థాయిలో...

పృథ్వీ అంతర్జాతీయంగా సింగిల్ ఆల్బమ్స్ కూడా విడుదల చేసాడు. హెడ్‌హంటర్జ్, గ్రెగర్ సాల్టో, అలై అండ్ ఫిలా, మార్నిక్, పారిస్ అండ్ సిమో లాంటి పలువురు ఇంటర్నేషనల్ డీజేలతో కలిసి పలు ప్రదర్శనలు ఇచ్చారు.

English summary
JanaSena YouTube channel has launched ‘Desh Bachao’ Protest musical album and it’s a free download. This protest musical album is a revisit of the protest , patriotic and inspirational songs which have conceived from Pawan Kalyan films around 14 years back. Now a a child prodigy “DJ Prithvi” made it electrifying with his DJ skills.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu