For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంక్రాంతి సంబరాల్లో నెల్లూరులో పవన్ (ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: నెల్లూరులోని స్వర్ణభారతి ట్రస్టులో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, స్టార్ హీరో పవన్‌కల్యాణ్‌ హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు పవన్‌కల్యాణ్‌ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడున్న అక్షర విద్యాలయాన్ని పవన్‌ పరిశీలించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్కూల్ పిల్లలతో కాసేపు వీరిద్దదరూ సరదాగా ముచ్చటించారు.

  పవన్ మాట్లాడుతూ... దేశ భవిష్యత్ మొత్తం అంతా విధ్యార్దులపైనే ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్ లో మెరుగైన చక్కని భారతదేశాన్ని సాధించుకోవాలంటే బాలలు చక్కగా చదువుకోవాలని ఆయన అన్నారు. అంతా బాగా చదువుకుంటామని మాటివ్వాలని ఆయన బాలలను కోరారు. బాలలంతా ఆయనకు బాగా చదువుకుంటామని చెప్పటంపవన్ హర్షం వ్యక్తం చేసారు.

  ఇక స్వచ్ఛభారత్‌ ప్రచార్తగా పవన్‌ కల్యాణ్‌ను నియమించిన విషయంతో పాటు ఈ రోజు నెల్లూరులో జరిగే కార్యక్రమానికి పవన్‌కల్యాణ్‌ హాజరవుతారని ఇదివరకే ఓ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

  తిరుపతి నుంచి ప్రత్యేక కారులో నెల్లూరుకు చేరుకున్నారు. అక్కడ జరిగే స్వచ్ఛభారత్‌ కారర్యక్రమంలో పాల్గొని నెల్లూరును సస్యశ్యామలం చేయనున్నారు. పవన్‌ కల్యాణ్‌ నెల్లూరుకు వస్తున్న వార్తను తెలుసుకొన్న అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమ స్థలికి చేరుకున్నారు.

  Pawan Kalyan Visits Nellore For Naidu

  పవన్ తాజా చిత్రాల విషయానికి వస్తే...

  వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ మొదటిసారి కలిసి నటించిన ‘గోపాల గోపాల' . ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శనివారం (10వ తేదీ) విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చకుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సురేశ్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్‌కుమార్‌ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్‌ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది.

  Pawan Kalyan Visits Nellore For Naidu

  చిత్రం కథేమిటంటే...

  దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.

  దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు. మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.

  ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటించారు.

  English summary
  Pawan Kalyan is on the way to Nellore. He is the chief guest for Central Minister Venkaiah Naidu's 'Sankranti Sambaram' event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X