Don't Miss!
- News
Visaka: మహిళలకు అనువైన నగరంగా విశాఖ.. టాప్-10 నగరాల్లో చోటు..
- Automobiles
పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. మీరు ఇలానే చేశారా..?
- Lifestyle
డ్రై స్కిన్ మరియు స్కిన్ ఇచ్చింగ్ నివారణకు ఆయుర్వేదంలో సులభ చిట్కాలు
- Sports
SA20 League: శతక్కొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డు!
- Finance
Gautam Adani: ఆ వ్యసనానికి బానిసైన గౌతమ్ అదానీ..! ఒప్పుకున్న బిలియనీర్..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Pawan Kalyan: ముగిసిన పవన్ కల్యాణ్ యుద్ధం.. లక్ష్మీ నరసింహా స్వామి విగ్రహం అందజేత
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి తెరగేంట్రం చేశాడు పవన్ కల్యాణ్. తనదైన శైలీలో నటిస్తూ అశేషమైన అభిమానగనానన్ని సంపాదించుకుని ప్రత్యేకమైన స్టార్ డమ్ సాధించుకున్నాడు. అంచెలంచలుగా ఎదిగి టాలీవుడ్‌లో పవర్ స్టార్ అనే బ్రాండ్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన నుంచి సినిమాలు, వచ్చిన, పోస్టర్లు విడుదలైన సోషల్ మీడియా షేక్ అవుతుంది. పవన్ కల్యాణ్ అభిమానులు ఇప్పుడు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

భారీ స్పందన..
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ఫ్లాప్‌లు అంటూ తేడా లేకుండా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరో ఎవరైన ఉన్నారంటే అది పవన్ కల్యాణ్ అనే చెప్పవచ్చు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోయే పవన్ కల్యాణ్ కొత్త మూవీ వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. ఇటీవల పవన్ కల్యాణ్.. వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. వాటన్నింటికి అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పవన్ కల్యాణ్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.

మరొక షెడ్యూల్ పూర్తి..
ప్రస్తుతం
సెట్స్
పై
ఉన్న
పవన్
కల్యాణ్
సినిమా
హరిహర
వీరమల్లు.
టాలెంటెడ్
డైరెక్టర్
క్రిష్
జాగర్లమూడి
తెరకెక్కిస్తోన్న
ఈ
సినిమాను
ఏఎమ్
రత్నం
భారీ
బడ్జెట్‌తో
నిర్మిస్తున్నారు.
భారీ
బడ్జెట్
తో
పాన్
ఇండియా
చిత్రంగా
వస్తున్న
ఈ
మూవీ
చిత్రీకరణ
ఇప్పటికే
60
శాతం
పూర్తయింది.
తాజాగా
మరొక
షెడ్యూల్
ను
పూర్తి
చేసుకుంది
ఈ
సినిమా.
దీనికి
సంబంధించిన
విషయాన్ని
సోషల్
మీడియా
వేదికగా
పంచుకున్నారు
ఫైట్
మాస్టర్
విజయ్.
లక్ష్మీ నరసింహా స్వామి విగ్రహం అందజేత..
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గత కొద్ది రోజులుగా హరిహర వీరమల్లు చిత్రీకరణ జరుగుతోంది. అందులో కీలకమైన యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాలో మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసినట్లు ఫైట్ మాస్టర్ విజయ్ సోషల్ మీడియాలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు లక్ష్మీ నరసింహా స్వామి విగ్రాహాన్ని అందించారు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు విజయ్ మాస్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ హరిహర వీరమల్లు తర్వాతి షెడ్యూల్ కోసం ప్రిపరేషన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా ఉంటాయని టాక్. గెరెల్లా పద్ధతిలో పవన్ కల్యాణ్ పోరాటం చేసే దృశ్యాలను తెరకెక్కించారని సమాచారం.
మరిన్ని చిత్రాలతో బిజీగా..
ఇదిలా ఉంటే ఈ సినిమానే కాకుండా పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేశారని టాక్. దీంతోపాటు సాయి ధరమ్ తేజ్ హీరోగా, పవన్ ప్రత్యేక పాత్రలో నటించనున్న తమిళ హిట్ మూవీ వినోదయ సీతం రీమేక్ కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారట. డీవీవీ దానయ్య నిర్మాతగ సుజీత్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా పవన్ కల్యాణ్ ప్రారంభించారని టాక్. వచ్చే సంవత్సరం ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.