twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెగించారు : పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్‌లలో పైచేయి ఎవరిది?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఓ వైపు ఉద్యమాలు, మరో వైపు సినిమాలను అడ్డుకుంటామని బెదిరింపుల కారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది', యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాల విడుదల అనుకున్న సమయానికి సాధ్యం కాలేదు. ఈ ఇద్దరి సినిమాలు ఆగిపోవడానికి కారణం వీరు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన వారు కావడమే.

    చిరంజీవి తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనక పోవడం సమైక్య వాదులకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఆగ్రహంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమైక్య నినాదంతో హరికృష్ణ తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం తెలంగాణ వాదులకు ఆగ్రహం తెప్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమాల విడుదల నిలిపి వేసారు.

    ప్రస్తుతం వేడి కాస్త తగ్గడం, పరిస్థితులను చూస్తూ కూర్చుంటే నష్టపోతామని దర్శక నిర్మాతలు భావిస్తున్న నేపథ్యంలో రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొందాం, విడుదల చేయండి ....అంటూ ఇటు పవన్ కళ్యాణ్, అటు జూ ఎన్టీఆర్ తెగింపు ప్రదర్శడంతో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు.

    'అత్తారింటికి దారేది' అక్టోబర్ 9న విడుదల చేయాలని నిర్ణయించారు. మరో వైపు 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని కేవలం ఒకరోజు గ్యాప్‌తో అక్టోబర్ 10న విడుదల చేయాలని డిసైడ్ చేసారు. ఇద్దరు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్సే కావడంతో.....బాక్సీఫీసు వద్ద ఒకే సమయంలో ఢీకొంటుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. తెగింపుగా ముందుకొచ్చిన వీరిద్దరిలో బాక్సాఫీసు కలెక్షన్ల రేసులో ఎవరు పైచేయి సాధిస్తారు? అనేది మరికొన్ని రోజుల్లో తేల నుంది.

    రెండు అలాంటి సినిమాలే...

    రెండు అలాంటి సినిమాలే...


    2013 సంవత్సరం ద్వితీయార్థంలో బాగా హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘అత్తారింటికి దారేది', ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...రెండు సినిమాలు కూడా రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో కూడి, మాస్ మసాలా ఎలిమెంట్స్ ఉన్న సినిమాలే కావడం.

    అత్తారింటికి దారేదిలో పవన్

    అత్తారింటికి దారేదిలో పవన్


    అత్తారింటికి దారేది చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న పవర్ స్టార్‌తో త్రివిక్రమ్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    రామయ్యా వస్తావయ్యాలో జూ ఎన్టీఆర్

    రామయ్యా వస్తావయ్యాలో జూ ఎన్టీఆర్


    రామయ్యా వస్తావయ్యా చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు పవన్ స్టార్ నటించిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాంటి దర్శకుడు జూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో జతకట్టడం సినిమాపై హైప్ పెరిగింది.

    అత్తారింటికి దారేదిలో ఇద్దరు హీరోయిన్లు

    అత్తారింటికి దారేదిలో ఇద్దరు హీరోయిన్లు


    అత్తారింటికి దారేది చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత నటిస్తున్నారు.

    రామయ్యా వస్తావయ్యా చిత్రంలోనూ ఇద్దరు

    రామయ్యా వస్తావయ్యా చిత్రంలోనూ ఇద్దరు


    రామయ్య వస్తావయ్యా చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంతతో పాటు శృతి హాసన్ నటిస్తున్నారు.

    అత్తారింటికి దారేది చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్

    అత్తారింటికి దారేది చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్


    అత్తారింటికి దారేది చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. పాటలు హిట్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

    రామయ్యా..కు తమన్ మ్యూజిక్

    రామయ్యా..కు తమన్ మ్యూజిక్


    రామయ్యా వస్తావయ్యా చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 20న విడుదల కానుంది.

    అత్తారింటికి దారేది చిత్రంలో నటీనటులు

    అత్తారింటికి దారేది చిత్రంలో నటీనటులు


    అత్తారింటికి దారేది చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నదియా పవన్ అత్తపాత్రలో నటిస్తోంది. ఇంకా ముకేష్ రిషి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలి, కోట శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ, ముంతాజ్, హంసా నందిని, శ్రీనివాసరెడ్డి, అమిత్, భరత్ రెడ్డి, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.

    రామయ్యా వస్తావయ్యలో నటీనటులు..

    రామయ్యా వస్తావయ్యలో నటీనటులు..


    రామయ్యా వస్తావయ్యా చిత్రంలో కోట శ్రీనివాసరావు, ముఖేష్ రిషి, తనికెళ్ల భరణి, రవిశంకర్ పి, ప్రగతి, రావు రమేష్ అండ్ అజయ్ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    అత్తారింటికి దారేది నిర్మాత టెన్షన్

    అత్తారింటికి దారేది నిర్మాత టెన్షన్


    అత్తారింటికి దారేది చిత్రాన్ని వాస్తవానికి ఆగస్టు 7వ తేదీనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఉద్యమాలు రగులుకోవడంతో సినిమా వాయిదా పడింది. రెండు నెలలు ఆలస్యంగా సినిమా విడుదలువుతోంది. ఈ కారణంగా నిర్మాత బివిఎస్ఎన్ తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయట.

    దిల్ రాజు నిర్ణయంతో ప్రసాద్ షాక్

    దిల్ రాజు నిర్ణయంతో ప్రసాద్ షాక్


    ‘అత్తారింటికి దారేది' చిత్రం విడుదల మరుసటి రోజే రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించడం నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌ను షాక్ కు గురి చేసింది. అయితే పవర్ స్టార్ సినిమా కావడంతో తన పెట్టుబడికి ఢోకాలేదనే ధైర్యంతో ఉన్నాడట.

    English summary
    The present political turmoil in Andhra Pradesh has created confusion in the release dates of many biggies' film. But finally, this uncertainty seems to be getting over. Yes! Pawan Kalyan's Attarintiki Daredi (AD), which was delayed for long time, is set to hit the screens on October 9 and it will clash with Junior NTR's Ramayya Vasthavayya (RV) at the Box Office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X