Just In
Don't Miss!
- Sports
ప్రపంచం ఏమైనా పిచ్చిదా?.. స్పిన్ని సమర్థంగా ఎదుర్కొనే అతడిని ఎందుకు తీసుకోలేదు: మైకేల్ వాన్ ఫైర్
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇలా నోరు పారేసుకుందేంటి? : బలవంత పెడితేనే పవన్ తో సినిమా చేసా...కెరీర్ నాశనం
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో తో సినిమా చేస్తే కెరీర్ మలుపు తిరుగుతుందని , అందరి దృష్టి తమపై పడుతుందని అందరూ ఆశపడతారు. కానీ పవన్ తో తన తొలి చిత్రం చేయటమే తనకు దెబ్బ కొట్టిందంటోంది నిఖిషా పటేల్.
ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్‌జే సూర్య దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన చిత్రం 'కొమరం పులి'. ఆ సినిమాతోనే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది నికిషా పటేల్. పవన్ సినిమాలో హీరోయిన్ అంటే ఆ తర్వాత వరుసబెట్టి సినిమా అవకాశాలు వచ్చేస్తాయని ఆశపెట్టుకుంది.
కానీ, ఆ సినిమా పరాజయం పాలవడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత ఆమె నోరు విప్పి, పవన్ సినిమాతోనే తన కెరీర్ నాశనమైనట్లు మాట్లాడుతోంది.

ఒత్తిడివల్లే..
నిజానికి ఆమె ‘కొమరం పులి'లో నటించడానికి మొదట ఇష్టపడలేదట. దర్శకుడు ఎస్‌జే సూర్య ఒత్తిడి చేయడం వల్లే ఒప్పుకుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలియజేసింది.

ఇష్టమే లేదు
నిఖిషా పటేల్ మాట్లాడుతూ..‘ఓ బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇద్దామనుకున్నా. నాకు ప్రాంతీయ సినిమాల్లో నటించడం ఇష్టమే లేదు. కానీ దర్శకుడు ఎస్‌జే సూర్య నన్ను బలవంతపెట్టి ‘కొమరం పులి'లో నటింపజేశాడు అన్నారు.

చాలా ఏళ్లు ఖాళీగానే
కొమరం పులి చిత్రం పరాజయం పాలవడంతో ఆ తర్వాత నాకు అవకాశాలు రాలేదు. అలా చాలా ఏళ్లు ఖాళీగానే ఉన్నాను. ఇప్పుడిప్పుడు కొద్దిగా అవకాశాలు వస్తున్నాయ'ని నికిషా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

కథ నచ్చే చేసానంది
పుట్టింది:పెరిగింది యు.కె
తల్లి : గుజరాతీ
తండ్రి : కెన్యా (నైరోబీ)
ఇండియా గురించి : హిందీ సినిమాలు బాగా చూసా
అభిమాన హీరోయిన్ :మాధురీ దీక్షిత్
ఎలాంటి పాత్ర,ఏ భాష ఏక్సెప్ట్ చేస్తారు: హిందీ,తెలుగు,గుజరాతీ పాత్ర చిన్నదైనా పెద్దదైనా నో ప్లాబ్లెమ్
పులికి ఎలా సెలక్టయ్యారు: డైరక్టర్ ఎస్.జె.సూర్య నాకు ముంబైలో మోడలింగ్ రోజులనుండీ ప్రెండ్ ఆయన నా పోర్ట్ ఫోలియా ఏక్టింగ్ స్కిల్స్ చూసి ఈ అవకాశమిచ్చారు.నాకేమో కథ బాగా నచ్చింది.
ఆనందకర విషయం: బెస్ట్ సినిమోటోగ్రాఫర్ బిందు ప్రమోదన్ తో కలసి పనిచేయటం,

పవన్ ఎంక్వైరీ చేస్తే...
పవర్ స్టార్ పవన్ గురించి : అసలు నాకు అంతకు ముందు పవన్ గురించి తెలియదు. తర్వాత యుకే లో ఎంక్వైరీ చేస్తే తెలిసింది అక్కడ వెరీ వెరీ పాపులర్ అని...షాక్ తెల్సా
విషయం తెల్సాక అమ్మా నాన్న: ఆమె మొదట పులికి కమిటయ్యింది అని తెలియగానే ఇంట్లో వాళ్ళు చాలా బాగా రెస్పాన్స్ అయ్యి సపోర్ట్ గా నిలిచారుట. పొరపాటున కూడా డిస్కరేజ్ చేయలేదట.

సహనంతో కూడిన
ఇక సినిమా షూటింగ్ లో ఆమె ఏమీ చేయకుండానే టైర్ అయిపోతున్నానంటూ చెప్తోంది. ఎందుకలా అంటే సెట్స్ పై నెస్ట్స్ షాట్ కోసం వెయిట్ చేయటం అనేది చాలా సహనంతో కూడిన పక్రియ అంటోంది.

చాలా రిజర్వ్ గా
ఇప్పుడు పవన్ గురించి నిజ జీవితంలో కూడా పవన్ చాలా రిజర్వ్ గా ఉంటారు. ఖాళీ దొరికితే పుస్తకంలో తల దూర్చేసాడు. ఏక్ట్ చేసేటప్పుడు ఈజీగా ఇన్వాల్స్ అయిపోతారు. గ్రేట్

నిద్రపోతూంటా...
షూటింగ్ లేనప్పుడు నా సొంతఊరెళ్ళిపోతా(లండన్)..లేదా హోటల్ రూమ్ లో నిద్రపోతూంటా.పార్టీలుకు దూరం.రియాలిటీ షో లంటే ఇష్టం హైదరాబాద్ లో:ముత్యాలు చాలా కొన్నాను తెలుసా
హైదరాబాద్ బిర్యానీ: సూపర్ ...ఫస్ట్ టైమ్ టేస్ట్ చేసే వదలలేక పోయా
కెమెరా మొదటిసారి ఫేస్ చేస్తున్నారా: అదేం లేదు నా ఇరవై ఏళ్ళ వయిస్సుకే చాలా ఏడ్స్ కి మోడల్ గా చేసా,
తెలుసా :మిస్ వాలెస్,మిస్ వరల్డ్ కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చేసా
తెలుగు: ఎలియన్ లాంగ్వేజ్ కానీ ఇప్పుడు కొద్దిగా వచ్చు...త్వరలో మొత్తం పట్టేస్తా

నమ్మకం లేదు కదా
పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించలేదు. భార్యాభర్తలుగా జీవించేందుకు పెళ్లి బంధం అక్కర్లేదన్నదే నా అభిప్రాయం. పెళ్లితో వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్న నమ్మకం లేదు. 2030 సంవత్సరానికల్లా మన దేశంలో పెళ్లి అనే బంధం స్థానంలో సహజీవన శైలి పెరుగుతుందని నమ్ముతున్నా. నాకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని చెప్పారు.

మంచి డైరక్టర్స్ ఏరి
సినిమా హిట్టా ఫట్టా అనేది దర్శకుడి ప్రతిభపైనే ఆధారపడి వుంటుందని, ఇందులో నటీనటుల పాత్ర చాలా తక్కువ ఉంటుందని నికీషా పటేల్ వెల్లడించింది. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో మంచి దర్శకులు లేరని.. అందుకే ఇబ్బందులు వస్తున్నాయని ట్విట్టర్ ద్వారా నికీషా పటేల్ పేర్కొంది.