Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'గోపాల గోపాల' ఆడియో విడుదల విశేషాలు (ఫొటోలతో)
హైదరాబాద్: "నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే' ఆడియో వేడుకకు వచ్చి వెళ్తుండగా, అభిమానులు నా కారుకు అడ్డంపడి, ‘అన్నా ఒక్క హిట్టియ్యన్నా. రోడ్డుమీద తలెత్తుకు తిరగలేకపోతున్నాం' అని వేడుకున్నారు. చాలా బాధనిపించింది. ఇప్పుడు వరుస హిట్లొచ్చాయి. అభిమానులు నా మీద చూపించే ప్రేమ, ఆప్యాయతకు భగవంతుడు కరుణించాడు" అంటూ ఉద్వేగంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్.
స్టార్ హీరోలు పవన్‌కల్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'గోపాల గోపాల'. బాలీవుడ్‌లో విజయం సాధించిన 'ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్. కిషోర్ పార్థసాని(డాలి) దర్శకుడు. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సురేష్‌బాబు, శరత్ మరాఠ్ నిర్మాతలు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సహా పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు.
https://www.facebook.com/TeluguFilmibeat
''చిన్నప్పట్నుంచి నాకు ఏం అవ్వాలో తెలిసేది కాదు. మా అమ్మ అడిగినా, అన్నయ్యలు అడిగినా నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. చివరికి ఈ ప్రపంచంలో ఇమడలేనని భావించి స్నేహితుడితో కలిసి శ్రీశైలం అడవుల్లోకి పారిపోదామనుకొన్నా'' అన్నారు పవన్ కల్యాణ్.
మరిన్ని ఆడియో విశేషాలు... ఫొటోలు స్లైడ్ షోలో...

అభిమానుల సమక్షంలో...
ఈ చిత్రంలోని గీతాలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో భారీగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో విడుదలయ్యాయి.

ఆవిష్కరణ
పవన్ కల్యాణ్ తొలి సీడీని ఆవిష్కరించారు.

స్వీకరణ
పవన్ ఆవిష్కరించిన తొలి సీడిని స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్, వెంకటేష్ స్వీకరించారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.....
''నేను పెద్దగా చదువుకోలేదు. అందుకే ఏం అవ్వాలో అవగాహన ఉండేది కాదు. అయితే భగవంతుడంటే భయం ఉండేది. నేను నమ్మే దేవుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదు. ఆ దేవుడికి దగ్గరగా అడవుల్లోకి వెళ్లిపోదామని నేను, నా స్నేహితుడు అనంద్ సాయి నిర్ణయించుకొన్నాం. అదే సమయంలోనే హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. హైదరాబాద్‌కి వచ్చేసెయ్ అన్నారు. ఇక్కడికొచ్చాక ఎవరో దీక్ష ఇచ్చారు. అక్కడ ధ్యానం నేర్చుకొన్నా.

చెంపపెట్టులా అనిపించాయి..
అన్నయ్య దెబ్బలు తగిలించుకొని ఇంటికొస్తే నేను యోగా, ధ్యానం అంటూ రోజూ కథలు కథలుగా చెప్పేవాణ్ని. 'అన్నీ సమకూరుతున్నప్పుడు సలహాలు చెప్పడం కాదు. నీ వంతు నువ్వు కష్టపడి ఇలాంటివి చెప్పు. అప్పుడు నువ్వు చెప్పింది నమ్ముతా' అన్నారు. ఆ మాటలు చెంపపెట్టులా అనిపించాయి అన్నారు పవన్.

ఫ్యాన్స్ గోల చేసేవాళ్లు..
'ఖుషి' తర్వాత నాకు విజయాలు లేవు. అన్నా ఒక్క విజయం ఇవ్వు... అంటూ అభిమానులు గోల చేసేవాళ్లు. 'గబ్బర్‌సింగ్' చిత్రీకరణ సమయంలోనూ సెట్‌కి వచ్చి 'హిట్టు ఇవ్వు అన్నా.. కావాలంటే మేం స్క్రిప్టు ఇస్తాం' అని వేడుకొన్నారు. అప్పుడు వారి అభిమానం ఏంటో అర్థమైంది.

సినిమాలు వదిలి వెళ్లిపోతా...
అప్పటివరకు నేను భగవంతుడిని ఏమీ కోరలేదు. ఆ రోజు తొలిసారి 'దేవుడా నాకొక్క విజయం ఇవ్వు, ఇక సినిమాలు వదిలి వెళ్లిపోతా' అని కోరుకొన్నా. అప్పట్నుంచి దేవుడు విజయాలు ఇస్తూనే ఉన్నాడు. జయాపజయాలు అనేవి నా చేతుల్లో లేవు. కష్టపడటం ఒక్కటే నా చేతుల్లో ఉంది. నా తెలివితేటలతో విజయాలు రాలేదు. అవన్నీ అభిమానులు ఇచ్చినవే. ఎప్పుడూ నన్ను వదిలిపెట్టి వెళ్లలేదు అభిమానులు. వాళ్ల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను అన్నారు పవన్.

మోకరిల్లుతా...
అన్నీ వదిలేసి పారిపోవడం కాదు, అన్ని పనులు ఇక్కడే చేయాలి. అదే సమయంలో భగవంతుడి మార్గమూ వదులుకోకూడదు. అన్నయ్య ఆరోజు చెప్పిన మాటలు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొంటా. అభిమానులు, అన్నయ్య ఇలా ఎంతమంది ఉన్నా సరే విశ్వం ముందు, భగవంతుడి ముందు మోకరిల్లుతా అని పవన్ అన్నారు.

ఇద్దరం కలిస్తే...
వెంకటేష్‌గారితో చాలాసార్లు సినిమా చేయాలనుకొన్నా. రామానాయుడుగారు అడిగేవారు. కానీ ఎప్పుడూ వీలుకాలేదు. ఇప్పుడిలా ఈ సినిమాతో కుదిరింది. నేను, వెంకటేష్‌గారు కలిస్తే ఆధ్యాత్మిక విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకొంటుంటాం. ఆ అభిరుచి ఉన్న మాకు ఇలాంటి కథ దొరకడం సంతోషంగా ఉంది అన్నారు పవన్ .

మళ్లీ ఇద్దరితోనూ చేస్తూ...
డాలీ మంచి దర్శకుడు. ఈ చిత్రాన్ని అతను తెరకెక్కించిన విధానం నచ్చింది. రాబోయే రోజుల్లో అతనితో ఓ సినిమానీ, అనూప్ రూబెన్స్ సంగీతంతో ఓ సినిమానీ చేస్తాను అని పవన్ హామీ ఇచ్చారు.

కాలు కదిపాను..
సాధారణంగా పాటల్లో ఎక్కువగా నేను నడుస్తుంటాను. ఇందులో కాస్త కాలు కదిపాను'' అని పవన్ చెప్పుకొచ్చారు.

ఒళ్లు దగ్గరపెట్టి చేసా...
ఒళ్లు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. పొరపాట్లు ఏమైనా ఉంటే ఆ భగవంతుడినే మన్నించమని కోరుకొంటున్నా'' అంటూ ముగించారు పవన్ కళ్యాణ్.

వెంకటేష్ మాట్లాడుతూ...
''ఒక కొత్త పంథాలో తీసిన సినిమా ఇది. పవన్ ఈ కథని ఒప్పుకోవడం అన్నిటికంటే ఎక్కువ ఆనందం కలిగించింది. ఈ సినిమాలో ఒక సంభాషణ ఉంది. 'లేటుగా వచ్చినా పక్కాగా వస్తాం' అని. పవన్‌తో చాలాసార్లు సినిమా చేయాలనుకొన్నా. కానీ లేటుగా అయినా మంచి సినిమాతో వచ్చాం. పవర్, విక్టరీ అభిమానులు కలిస్తే ఇది పవర్‌ఫుల్ విక్టరీ అవుతుంది'' అన్నారు.

వెంకటేశ్ కంటిన్యూ చేస్తూ...
‘‘ఇందులో నాది సింపుల్ కేరక్టర్. పాటలు బాగా వచ్చాయి. పవన్‌కల్యాణ్ అంటే పవర్‌స్టార్ కాదు, సూపర్ పవర్‌స్టార్ అని ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమా చెయ్యడానికి కల్యాణ్ ఒప్పుకోవడం గొప్ప విషయం. మీ పవరూ, మా విక్టరీ కలిపి ఈ సంక్రాంతికి పవర్‌ఫుల్ విక్టరీ చెయ్యాలి'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...
''ఇద్దరు స్టార్స్‌తో సినిమా తీయడం బాధ్యత అనుకొన్నా. వెంకటేష్‌తో చాలా సౌకర్యంగా ఉంటుంది. పవన్ ప్రయాణంలో నేనూ కొన్ని అడుగులు వేయడం సంతోషం అనిపించింది. ఈ ప్రయాణంలో నేను చాలా నేర్చుకొన్నా'' అన్నారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ...
''నాకు ఇష్టమైన వెంకటేష్. పవన్‌కల్యాణ్ కలిసి చేసిన ఈ సినిమా వినోదంతో పాటు సందేశమూ ఇస్తుంది. సంక్రాంతి పండగకి థియేటర్లో కలుద్దాం'' అన్నారు.

ఈ కార్యక్రమంలో ...
డి. సురేశ్, శరత్‌మరార్, కిశోర్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, తివిక్రమ్, దిల్ రాజు, జెమిని కిరణ్, ఎడిటర్ గౌతంరాజు, గేయ రచయిత అనంత శ్రీరామ్, సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు.