»   » అలీకి కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్, ఏంటో తెలుసా?

అలీకి కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్, ఏంటో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలీ మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్ ఫిప్ గురించి అందరికీ తెలిసిందే. తన క్లోజ్ ఫ్రెండు కోసం చాలా చేసాడు పవన్. అలీ హీరోగా నటిస్తున్న 50వ సినిమా 'అలీ బాబా ఒక్కడే దొంగ' చిత్రం ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఆడియో రిలీజ్ చేసి సినిమాకు హైప్ తేవడానికి సహకరించారు.

తాజాగా సినిమా విడుదలను పురస్కరించుకుని స్పెషల్ గిఫ్ట్ పంపారు పవన్. ఆల్ ది బెస్ట్ అంటూ గ్రీటింగ్స్ పంపడంతో పాటు 'అత్తారింటికి దారేది' చిత్రంలో తాను ధరించి బ్లాక్ కలర్ బ్లెజర్ (కోటు)ను అలీకి గిఫ్టుగా పంపారు. పవన్ నుండి ఈ అరుదైన గిఫ్టు అందుకున్న అలీ చాలా హ్యాపీ ఫీలయ్యారట.

అలీ 50వ చిత్రం 'అలీ బాబా ఒక్కడే దొంగ' సినిమా విషయానికొస్తే.......అలీ కథానాయకుడుగా కమల్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డెడ శివాజీ రూపొందిస్తున్న చిత్రం 'అలీ బాబా ఒక్కడే దొంగ'. ఈ సినిమాకు అల్లరి నరేష్ వాయిస్ వోవర్ ఇచ్చారు.

సినిమా మొదటినుండి చివరి వరకు ఆసక్తికరంగా, తమాషాగా సాగుతుందని, కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అన్ని పాత్రలు వినోదాన్ని అందిస్తాయని దర్శకుడు ఫణిప్రకాష్ తెలిపారు. పోలీస్ అవుదామని దొంగగా మారిన యువకుని కథే ఈ చిత్రకథాంశమని ఆయన అన్నారు. సుజావారుణి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జాన్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: బొడ్డెడ శివాజీ, దర్శకత్వం: ఫణిప్రకాష్.

English summary
Pawan Kalyan recently attended the audio launch of Ali’s Ali Baba Okkade Donga as Chief Guest. And now Pawan made Ali’s day further special. On the eve of movie release, Pawan Kalyan sent in a special gift to Ali with ‘All the Best’ message. Pawan Kalyan sent Ali a black blazer he used in Attarintiki Daredi as gift. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu