twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం రికార్డులు తిరగరాస్తున్న పవన్ తీన్ మార్...!

    By Sindhu
    |

    పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధికంగా 1150 ధియేటర్లలో విడుదలవుతున్న తీన్ మార్ చిత్రం చిత్రం తొలిరోజు అనగా నేడు 4000 ప్రదర్శనలు పూర్తి చేసుకోనుండడం ద్వారా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈ 4000 ప్రదర్శనల ద్వారా రూ.8 కోట్ల పైచిలుకు షేర్‌ వసూలు చేయగలదని టాలీవుడ్‌ ట్రేడ్‌ పండిట్స్‌ అంచనా వేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రల్లో ఆయన అధ్బుతంగా కనిపిస్తాడంటున్నారు. పదేళ్ల కాలంలో రెండంటే రెండే హిట్లించిన పవన్ ఈసారి హిట్ కొట్టాడా లేదా?ప్రీమియర్ షోస్ రిపోర్టులని బట్టి తీన్ మార్ సినిమాతో పవన్ హిట్ కొడతాడనే అనిపిస్తోంది.

    ఫస్టాఫ్ చాలా బాగుందని, సెకండాఫ్ కాస్త డల్ అయినా కానీ బోర్ కొట్టించలేదని రిపోర్ట్స్ వచ్చాయి. వస్తున్నాయి. పాటలన్నీ తెరపై చాలా బాగున్నాయని, పవన్ డాన్సులేశాడని చెబుతున్నారు. 'వయ్యారాలా జాబిల్లి", 'ఓహో బస్తీ దొరసాని", 'శ్రీగంగ" పాటలు చాలా బాగున్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గత చిత్రాలతో పోల్చాల్సి వస్తే 'జల్సా" కంటే మెరుగ్గా ఉందని, క్లాస్ సినిమా అయినా కానీ మాస్ కి కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉందని చెబుతున్నారు. చాలా చోట్ల ప్రీమియర్ షోస్ వేసినా కానీ దాదాపుగా అంతటా ఇదే టాక్ నడుస్తోంది. ప్లాప్ టాక్ తోనే సినిమాలకి కోట్లకి కోట్లు రాబట్టే పవన్ కళ్యాణ్ కి ఈ డీసెంట్ టాక్తో హిట్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదేమో. కృతి, పరేష్ రావల్, అలీ, సోనూసూద్, ముఖేష్ రిషి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జైనన్ విన్సెంట్. ఆర్ట్: నారాయణరెడ్డి, నిర్మాత: గణేశ్‌ బాబు, స్క్రీన్‌ప్లే దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ. పూర్తి సమీక్ష కోసం మరికొద్ది సేపట్లో...!

    English summary
    A mixed bag with its share of a few good moments, but a very average fare. Trivikram punch is largely missing, 2 songs and a few scenes of arjun palwai were good.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X