»   » వావ్...సినిమా చూసాక నచ్చితేనే డబ్బులివ్వడం!

వావ్...సినిమా చూసాక నచ్చితేనే డబ్బులివ్వడం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ టెన్షన్ లైఫ్ నుండి కాస్త రిలాక్స్ కావడానికి, వినోదం కోసం మనం సినిమా థియేటర్లకు వెలుతుంటాం. అయితే కొన్ని సినిమాలు మాత్రం....రిలాక్స్ కావడానికి వెళ్లిన మనల్ని మరింత టార్చర్ పెడుతుంటాయి. ఆ తర్వాత బయటకు వచ్చి డబ్బు, సమయం వేస్ట్ అయిందని బాధ పడుతుంటాం. ప్రతి ఒక్కరికి ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే ఉంటాయి.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విధానం....డబ్బులు ఇచ్చిన తర్వాతే సినిమా చూడటం. అయితే కన్నడ దర్శకుడు పవన్ కుమార్ మాత్రం....తన సినిమా చూసిన తర్వాత నచ్చితేనే డబ్బులివ్వమని అంటున్నాడు. లూసియా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడి సరికొత్త ప్రతిపాదన సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Pay money after watching the movie

ఈ ప్రతిపాదన గురించి ఆయన మాట్లాడుతూ...మేకింగ్ ఆఫ్ లూసియా అనే డాక్యుమెంటరీని ముందు ఉచితంగా చూడొచ్చని, అది నచ్చితేనే దానికి డబ్బు ఇవ్వాలని ఆయన సోషల్ నెట్వర్కింగు ద్వారా తెలిపారు. సరికొత్త విధానం మంచి సినిమాలకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.

అయితే పవన్ కుమార్ ప్రతిపాదనపై పలువురు నిర్మాతలు మండి పడుతున్నారు. ఆయన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఇలా....నిర్మాతలను నష్టపరిచే ఆలోచనలు చేస్తున్నాడని, ఇలాంటి ప్రతిపాదనలు ప్రపంచంలో ఎక్కడా అమలైన దాఖలాలు లేవని అంటున్నారు.

English summary

 Pay money after watching the movie says pawan kumar director of Kannada movie Lucia.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu