దర్శకులకు రెమ్యునేషన్స్ వేస్ట్ అని తేల్చాడు

By Srikanya

ఎప్పుడూ ఏదో ఒక కాంట్రావర్శి చేసి వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ చాలా మంది టాలీవుడ్ డైరక్టర్ కి చురకలాంటిది. సినిమాతో పాటే పెంచుకుంటూ పోతున్న దర్శకుల పారితోషకాలపై ఆయన మొహమాటం లేకుండా కామెంట్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. ఆయన మాటల్లోనే...ఓ టాప్ స్టార్ కొత్త దర్శకుడుతో వర్క్ చేసినా హిట్ అయితే కలెక్షన్స్ లో ఏ మాత్రం తేడా రాదు. అదే కొత్త హీరోతో,టాప్ డైరక్టర్ వర్క్ చేసినా ఆ రేంజి కలెక్షన్స్ రాబట్టడం కష్టం..అందుకే దర్శకుడుకి అంత డబ్బు చెల్లించటం వేస్ట్ అనుకుంటున్నాను అన్నారు. ఇక ఈ కామెంట్ ఆయన తెలుగు దర్శకులను ఉద్దేశించే అని చాలా మంది అనుకుంటున్నారు దానకి కారణం...ఒక్క సినిమా హిట్ కాగానే వాళ్లు తమ రెమ్యునేషన్ ని పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాణా,సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇక డిపార్టమెంట్ చిత్రంలోని ఎనకౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలను కూడా దయానాయక్, విజయ్ సలార్కర్, ప్రదీప్ శర్మ, సచిన్ వేజి ల నిజ జీవితాలనుంచి ప్రేరణ పొందిన కథతో రూపొందించనున్నారు. కథలో వీరు రకరకాలకుగా అండర్ వరల్డ్ డాన్ లను ఎదుర్కొంటారు. అయితే వీరి మధ్య రకరకాల ఇగోలు,సమస్యలు ఉంటాయి. అవి డిపార్టమెంట్ లో పనిచేసే మిగతా వారిపై పడతాయి. వీటిని సమన్వయపరుస్తూ సిటీని ప్రశాంతంగా ఉంచటానికి అమితాబ్ పాత్ర కృషి చేస్తూంటుంది. పూర్తి స్ధాయి యాక్షన్ పేకెడ్ గా రూపొందే ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తుందని చెప్తున్నారు. అంతకు మించి ఈ చిత్రంపై ఏమీ వ్యాఖ్యానించలేనంటున్నారు వర్మ.

ఈ చిత్రం గోవింద నిహలానీ అర్ధ సత్య తరహాలో ఉంటుందని, పోలీస్ డిపార్టమెంట్ లోని లోటు పాట్లని కాస్త లోతుగానే తన దైన శైలిలో ఆవిష్కరించనున్నాడని తెలుస్తోంది. ఈ దేశంలోని లా పోర్స్ ఎలా పనిచేస్తోందనే విషయాన్ని ఎక్సపోజ్ చేస్తున్నాని చెప్తున్నారు. ఇక అంతర్గత సమాచారం ప్రకారం కంపెనీ చిత్రం చేస్తున్నప్పుడే ఈ ఐడియా వచ్చిందని, మాఫియా మాదిరిగానే పోలీస్ డిపార్టమెంట్ లోపల ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంటుందని అదే యుఎస్ పి గా ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈచిత్రంలో పోలీస్ ఎనకౌంటర్ కిల్లింగ్స్ దగ్గరనుంచి, మాఫియా డీలింగ్స్, టెర్రరిస్టులుతో లింక్ లు దాకా ఈ చిత్రంలో చర్చించనున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X