For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  50 రోజులు ఆగి...ఇప్పుడు ఇండస్ట్రీ జనాలను ఉతికి ఆరేసిన .. 'పెళ్లి చూపులు' డైరక్టర్

  By Srikanya
  |

  హైదరాబాద్ : డి.సురేష్‌ బాబు సమర్పణలో రాజ్‌ కందుకూరి, ఎస్‌. రంగినేని నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'పెళ్లి చూపులు'. తరుణ్‌ భాస్కర్‌ దర్శకుడు. విజరు దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించారు. ఈ చిత్రం జూలై 29న విడుదలైంది. యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రం దర్శకుడు తరుణ్ భాస్కర్ ..ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టి ..సినిమా రిలీజ్ కు ముందు ఇండస్ట్ర్రీ వ్యక్తులు తనను ఎలా ఇబ్బంది పెట్టారో, తన సినిమా గురించి ఏమన్నారో చెప్పుకొచ్చారు. మీరూ చదవండి ఆ పోస్ట్ ని..

  మొదటి షో నుండే మంచి సినిమా అన్న టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం 'పెళ్లి చూపులు'. కొత్త దర్శకుడు 'తరుణ్ భాస్కర్' నేటి తరం ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, ఎలా కోరుకుంటున్నారు అన్నది సరిగ్గా క్యాచ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ రిఫ్రెషింగ్ ప్రేమ కథ ప్రస్తుతం విడుదలైన అన్ని మల్టీ ప్లెక్సులు, నగరాల్లో అద్భుతమైన ఆదరణను పొందుతోంది.

  ఈ చిన్న సినిమా ఇంతటి ఆదరణను, పబ్లిసిటీని తెచ్చుకోవడానికి కారణం డి. సురేష్ బాబు గారి భిన్నమైన ఆలోచన అని ఇండస్ట్రీ అంటోంది. ఒక సినిమా జనాల్లోకి వెళ్లాలంటే అన్నిటికన్నా మంచి పాజిటివ్ మౌత్ టాక్ ముఖ్యమని భావించిన ఆయన విడుదలకు ముందే ప్రివ్యూలు రూపంలో సినిమాను విమర్శకులకు ధైర్యంగా ప్రదర్శించమే కలిసొచ్చింది. సినిమా విమర్శకులను సైతం మెప్పించడంతో మంచి మౌత్ టాక్ మొదలై సినిమా విజయపథంలో దూసుకుపోతోంది.

  Pelli Choopulu Director Trolls "Industry People"

  ఎక్కడా బోర్ కొట్టించని నెరేషన్ తో పాటు సినిమా హీరో హీరోయిన్ల యాక్టింగ్ ఈ మూవీకి ప్రధానమైన హైలైట్. సురేష్ బాబు సమర్పణ పెళ్లి చూపులపై ఆసక్తి కలిగించగా.. రాజమౌళి ఈ సినిమా చేసిన కామెంట్స్ కలెక్షన్స్ స్టడీగా కొనసాగడానికి ఉపయోగపడ్డాయి.

  కథ విషయానికొస్తే... ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)... లైఫ్‌ను జాలీగా లీడ్ చేస్తూ ఇంజనీరింగ్ అతికష్టం మీద సప్లిలు రాసి పాసైనఇప్పటి జనరేషన్ కుర్రాడు. ఎంబీఏ పూర్తి చేసి సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్న అమ్మాయి చిత్ర (రీతు వర్మ). పనీ పాట లేకుండా తిరిగే ప్రశాంత్‌‌కు పెళ్లి చేయాలని, అప్పుడైనా జీవితం మీద బాధ్యత వస్తుందని చిత్రతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు.

  సొంతగా వ్యాపారం చేస్తానంటే ఇంట్లో సపోర్టు లేకపోవడంతో పాటు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో... ఈ పెళ్లి చేపులకు సిద్ధమవుతుంది చిత్ర. కట్ చేస్తే పెళ్లి చూపుల్లో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, పుడ్ ట్రక్ బిజినెస్ చేసి సొంతగా తన కాళ్ల మీద నిలబడాలనే ఆలోచన ఉందనే విషయం చెప్పి పెళ్లి నిరాకరిస్తుంది. దీంతో ప్రశాంత్ వేరొక అమ్మాయితో పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెడతాడు. కానీ అక్కడ కూడా వర్కౌట్ కాక పోగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ప్రశాంత్‌కు వంటలు చేయడం అంటే ఇష్టం. దీంతో చిత్రతో కలిసి ట్రక్ బిజినెస్‌లో జాయిన్ అవుతాడు. రెండు విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న వీరి జీవితాల్లో పెళ్లి చూపులు తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ తర్వాత ఏమైంది? అనేది అసలు స్టోరీ...

  English summary
  Made with a modest budget is 60 lakhs, Pelli Choopulu released after several months of painful waiting and ended up as a historic success by collecting nearly 15 crores worldwide share. In these times of success, the film's debut director Tharun Bhascker posted a lengthy message addressing the so called "industry people" who discouraged him before and during the making and release of Pelli Choopulu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X