»   » ‘పెళ్లి పుస్తకం’ ఆడియో విడుదల(ఫోటోలు)

‘పెళ్లి పుస్తకం’ ఆడియో విడుదల(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమ కథలకు ముగింపు పెళ్లిళ్లు కాదు. అసలు ప్రేమకథ మొదలయ్యేది పెళ్లి తర్వాతే.... అని తెలిపే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం 'పెళ్లి పుస్తకం'. 'అందాల రాక్షసి' ఫేమ్ రాహుల్, 'మేం వయసుకు వచ్చాం' ఫేం నీతి టేలర్ ఇందులో జంటగా నటిస్తున్నారు. రామకృష్ణ మచ్చకంటి దర్శకుడు.

లక్ష్మి నరసింహా సినీ విజన్స్ పతాకంపై బి.నాగిరెడ్డి, బి.వి.గోపాల్, పి. సుమణ్ నిర్మిస్తున్న ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రసాద్స్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆడియో సీడీలను ఆవిష్కరించారు.

దర్శకుడు మాట్లాడుతూ.. బాపుగారి దర్శకత్వంలో గతంలో పెళ్లి పుస్తకం సినిమా వచ్చింది. కానీ ఈ పెళ్లి పుస్తకం కథ పూర్తి డిఫరెంటుగా ఉంటుంది. పెళ్లయిన ఓ జంట జీవితంలో ఎలాంటి ఓడిదుడుకులను ఎదుర్కొన్నారు అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. పాత పెళ్లి పుస్తకంలోని శ్రీరస్తు శుభమస్తు అనే సాంగు తప్ప మరేవిషయంలోనూ పోలికలేదని తెలిపారు.

పెళ్లి పుస్తకం మూవీ ఆడియో రిలీజ్ వేడుక దృశ్యాలు.

పెళ్లి పుస్తకం మూవీ ఆడియో రిలీజ్ వేడుక దృశ్యాలు.

పెళ్లి పుస్తకం మూవీ ఆడియో రిలీజ్ వేడుక దృశ్యాలు.

పెళ్లి పుస్తకం మూవీ ఆడియో రిలీజ్ వేడుక దృశ్యాలు.

ఈ చిత్రంలో ఇంకా కాశీ విశ్వనాథ్, నాగినీడు, శ్రవణ్, దేశానంది, అనిల్, జ్యోతి రెడ్డి, శ్రీనివాస్, యశస్విని తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక వర్గం వివరాల్లోకి వెళితే... ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: నాగేంద్ర ప్రసాద్, ఫోటోగ్రఫీ: జవహర్ రెడ్డి ఎమ్.ఎన్, సంగీతం: శేఖర్ చంద్ర, నిర్మాత: బి. నాగిరెడ్డి, బి.వి.గోపాల్, పి.సుమన్, కథ, దర్శకత్వం: రామకృష్ణ మచ్చకంటి.

English summary
Rahul, Neethi Taylor starrer 'Pelli Pustakam' music launched in Hyderabad. Ramakrishna Macchukanti is the director. B.Nagireddy, B.V.Gopal and P.Suman are producing the movie under Lakshmi Narasimha Cine Visions banner.
Please Wait while comments are loading...