»   » కేసు వేస్తానంటున్న డిస్ట్రిబ్యూటర్, రాళ్లు వేస్తారంటున్న పూరి!

కేసు వేస్తానంటున్న డిస్ట్రిబ్యూటర్, రాళ్లు వేస్తారంటున్న పూరి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'లోఫర్' సినిమా నష్టాలకు సంబంధించిన దర్శకుడు పూరి జగన్నాధ్, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కాళీ సుధీర్, అభిషేక్ నామా, ముత్యాల రామదాస్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గరు తన ఆఫీసుకు వచ్చి తనపై దాడి చేసారంటూ పూరి ఆ మధ్య కేసు పెట్టడం హాట్ టాపిక్ అయింది.

అయితే పూరి జగన్నాథ్ మీద తాము దాడి చేయలేదని, మాపై ఆయన కావాలనే తప్పుడు కేసులు పెట్టారని, మేము దాడి చేసి ఉంటే పూరి జగన్నాధ్ ఆఫీసులో సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంది, అలాంటివేమైనా ఉంటే చూపించండి అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.

People always throw stones at trees bearing fruits: Puri

డిపార్టుమెంటుతో పని చేస్తున్నఏసిపి పూరి స్నేహితుడు కావడంతో...ఆయన కంప్లయింట్ ఇచ్చిన వెంటనే వెనకా ముందు ఆలోచించకుండా కేసు పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత పూరి కూడా కేసు వాపస్ తీసుకోవడం విశేషం.

అయితే ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన కాళీ సుధీర్ మాత్రం పూరిపై తిరిగి కేసు పెడతానంటున్నాడట. ఏ తప్పూ చేయని తనపై అనవసరంగా కేసు పెట్టి పూరి తనను బదనాం చేసాడని, అతనిపై లీగల్ గా కేసు వేస్తానని, మిగతా ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు తనకు సపోర్టు ఇచ్చినా, ఇవ్వక పోయినా పూరిని మాత్రం వదలబోనని అంటున్నారట.

కాళీ సుధీర్ గురించి ఇలా మీడియాలో ప్రచారం జరుగుతుండగా పూరి తన ట్విట్టర్లో వెరైటీగా స్పందించారు. నాలాగా నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్న ఫిల్మ్ మేకర్స్ విషయంలో సుధీర్ లాంటి వారు నాన్ స్టాప్ గా ఏదో ఇష్యూ చేస్తూ ఉంటారు. 'ఫలాలను ఇచ్చే చెట్టుపై జనాలు ఎప్పుడూ రాళ్లు వేస్తూనే ఉంటారు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కొందరైతే చెట్టునే నరికేయాలని ప్రయత్నిస్తారు. అబ్బా...ఇది ఎంత అందమైన ప్రపంచం' అంటూ ట్వీట్ చేసారు.

English summary
"No wonder, Ppl always throw stones at trees bearing fruits. And Some ppl even try to axe it. WHAT A LOVELY WORLD!!" Puri tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu