»   » రోడ్డున పడ్డ హీరోయిన్, డబ్బిస్తాం రాత్రికి వస్తావా అంటూ చీప్‌గా...

రోడ్డున పడ్డ హీరోయిన్, డబ్బిస్తాం రాత్రికి వస్తావా అంటూ చీప్‌గా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సినిమా హీరోయిన్ కావాలని రెక్కలు కట్టుకుని వాలిన ఆమె పరిస్థితి ఇపుడు మరీ దారుణంగా తయారైంది. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకున్నా సినిమా రంగం వైపు అడుగులు వేసిన ఆమె ఇపుడు రోడ్డున పడింది. అమ్మాయి పేరు అలీసా ఖాన్. 2013లో 'మై హస్బెండ్స్ వైఫ్' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన ఆమె ఇపుడు బాలీవుడ్ ఇమ్రాన్ హస్మితో కలిసి నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.

అయితే ఇటీవల తన బాయ్ ఫ్రెండుతో గడిపిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో పరువు పోయందని భావించి...ఆమెను ఇంట్లో నుండి గెంటి వేసారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఢిల్లీలోని వీధుల్లో జీవనం సాగిస్తోంది. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా తన పట్ల కొందరు అసభ్యంగా, చీప్ గా ప్రవర్తిస్తున్నారు. డబ్బులు ఇస్తాం రాత్రికి వస్తావా అంటూ అడుగుతున్నారు అంటూ అలీసా ఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది.

'మా ఫ్యామిలీ నన్ను ఇంట్లో నుండి గెంటివేయడంతో రోడ్డునపడ్డాను. నాకు వేరే దారి లేదు. కానీ మీడియాను నేను సహాయం కోరుతున్నాను. నేను పోరాటం చేయాలనుకుంటున్నాను. ప్రత్యూష బెనర్జీ మాదిరిగా నేను ఆత్మహత్య చేసుకోను. మా ముత్తాత చక్రవర్తి, ఆయన రక్తమే నాలో ప్రవహిస్తోంది. నేను ఎవరికీ భయపడను. రోడ్డు మీదనే జీవిస్తూ పోరాటం చేస్తాను' అంటూ అలీసా ఖాన్ తెలిపారు.

'నా మాజీ బాయ్ ఫ్రెండ్ మేము కలిసి గడిపిన వీడియోను ఆన్ లైన్ లో లీక్ చేసాడు. ఏప్రిల్ నెలలో షూటింగ్ నిమిత్తం ఢిల్లీ వచ్చినపుడు ఇది జరిగింది. దాన్ని ఆన్ లైన్ లో ఎప్పుడు పెట్టారో తెలియదు. సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న వారు, బాలీవుడ్ సర్కిల్ లోని ఫ్రెండ్స్ దీన్ని చూసి నాకు తెలియజేసారు. అది చూసి నేను షాకయ్యాను' అని అలీసా తెలిపారు.

బాయ్ ఫ్రెండ్

బాయ్ ఫ్రెండ్

తన బాయ్ ఫ్రెండ్ గురించి అడగ్గా....అలీసా స్పందిస్తూ..‘అతని పేరు సమీర్. పూర్తి పేరు ఏమిటీ నాకు తెలియదు. ఆయన నా బాయ్ ఫ్రెండ్ మాత్రమే...హస్బెండ్ కాదు' అని తెలిపారు.

ఇమ్రాన్ హష్మి హెల్ప్

ఇమ్రాన్ హష్మి హెల్ప్

మీ సహ నటుడు ఇమ్రాన్ హష్మి నుండి ఫైనాన్షియల్ హెల్ప్ మీరు ఎందుకు తీసుకోకూడదు అని అడ్డగా....‘ఒక సెలబ్రిటీగా నాకు కొన్ని విలువలు ఉన్నాయి. నేను ఒక స్టార్. ఎవరినీ డబ్బులు తీసుకోను, ఎవరి వద్ద బిచ్చం అడగను, నేను పోరాటం చేయగలను, పోరాటం చేస్తాను' అని తెలిపారు.

నగలు, ఫోన్ అమ్మేసింది

నగలు, ఫోన్ అమ్మేసింది

ఇంటి నుండి గెంటేసిన తర్వాత మీ ఆర్థిక అవసరాలు ఎలా తీర్చుకుంటున్నారు? అని అడ్డగా....‘నా నగలు అమ్మేసాను, గోల్డ్ చైన్, రింగ్ కూడా. ఫోన్ కూడా అమ్మేసాను. ఆ డబ్బుతోనే రోజులు గడుపుతున్నాను. కొందరు నా పరిస్థితి దారుణంగా ఉందని తెలుసుకుని డబ్బులు ఇస్తాం రాత్రికి వస్తావా అంటూ అడుగుతున్నారు.' అని అలీసా చెప్పుకొచ్చింది.

అలీసా ఎందుకిలా చేస్తోంది?

అలీసా ఎందుకిలా చేస్తోంది?

అలీసా ఎందుకిలా చేస్తోంది? మరీ రోడ్డు మీద ఉండేంత పరిస్థితి అయితే ఉండదు.....పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తోందా? మీడియాను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
Actor Alisa Kkhan says she is being abused on social media after her story of living on the Delhi streets surfaced. Khan, who will soon be seen in a film alongside actor Emraan Hashmi, has claimed that her family disowned her after her ex-boyfriend leaked her MMS online.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu