»   » పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీట్ అండ్ గ్రీట్ విత్ బ్రహ్మానందం, మంచు విష్ణు

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీట్ అండ్ గ్రీట్ విత్ బ్రహ్మానందం, మంచు విష్ణు

Written By:
Subscribe to Filmibeat Telugu

ఉత్తర అమెరికా , వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు చేయూతనిస్తోంది. పీపుల్ టెక్ అధినేత శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ స్థాపించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూడేళ్లపాటు మధుర గాయకుడు శ్రీ ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగా కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించింది. గతేడాది సినీ నిర్మాణం ప్రారంభించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నేచురల్ స్టార్ నాని హీరోగా, డీ వీ వీ దానయ్య నిన్ను కోరి చిత్రాన్ని నిర్మించింది. అమెరికా షూటింగ్ కోసం లైన్ ప్రొడ్యూసర్స్‌గా బాధ్యతలు నిర్వహించింది.

Peoples media factory's meet and greet with Manchu Vishnu

తాజాగా మంచు విష్ణు, బ్రహ్మానందం , ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఆచారి అమెరికా యాత్ర చిత్రానికి సంబంధించిన అమెరికా షూటింగ్ లైన్ ప్రొడక్షన్ చేపట్టింది.. ప్రస్తుతం ఈ సంస్థ నందమూరి కళ్యాణరామ్ హీరోగా రూపొందుతున్న 'ఎం.ఎల్.ఏ' చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా పాలుపంచుకొంటున్నది.

2019 సంవత్సరానికిగాను సియాటెల్‌లో జరుగనున్న నాట్స్ నేషనల్ కన్వెన్షన్‌ కు ఆర్గనైజింగ్ చైర్మన్ గా శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 2017 న సియాటెల్‌లో భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది మీడియా ఫ్యాక్టరీ. వాటా , వాట్స్ తదితర స్థానిక తెలుగు సంస్థల సహకారం తో జరిగే ఈ కార్యక్రమం పేరు మీట్ అండ్ గ్రీట్ బ్రహ్మానందం, మంచు విష్ణు , ప్రగ్యా , ప్రభాస్ శ్రీను . ఈ కార్యక్రమానికి హాజరు కాదలచిన వారు ఈవెంట్ బ్రైట్ అనే లింక్ ద్వారా వారి రిజిస్టర్ చేసుకోవచ్చును. నాట్స్ 2019 సభ్యత్వం పొందిన ఎన్నారై లందరు ఈ రెండేళ్లలో పీపుల్ మీడియా నిర్వహించు అన్ని కార్యక్రమాలలోను ఉచితంగా ప్రవేశము పొందగలరు.

Meet and Greet AAY Movie Crew (Brahmanandam, Manchu Vishnu, Pragna Jaiswal, Nageswar Reddy, Prabhas Seenu, Praveen, Surekha Vani).

English summary
NATS conducting meet and greet with Manchu Vishnu and Brahmanandam in Washington. In this occassion, NATS welcomes 2019 convention membership program. This event is supervised peoples media factory.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu