పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడుతున్న అనుష్క: ‘ఫిల్లౌరి’ ట్రైలర్
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం ‘ఫిల్లౌరీ’. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది.
హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'ఫిల్లౌరీ'. రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈచిత్రానికి అన్షై లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాక్స్ స్టార్స్ స్టూడియోస్ బేనర్లో అనుష్క శర్మ, కర్ణేష్ శర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. మంగళదోషం ఉన్న యువకుడు పెద్దల సలహాతో దోషం పోవడానికి చెట్టును పెళ్లాడతాడు. చెట్టును పెళ్లాడిన ఆ యువకుడిని దెయ్యం వెంటాడుతోంది. ఈ దెయ్యం పాత్రలో అనుష్క శర్మ నటిస్తోంది.
అసలు అనుష్క శర్మ దెయ్యంగా ఎందుకు మారింది. ఆ యువకుడి వెంట ఎందుకు పడింది.... అనుష్క శర్మకు ఆ యువకుడికి సంబంధం ఏమిటి? అనేది సినిమాలో ఆసక్తికర అంశం. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. మంచి స్పందన వస్తోంది. మార్చి 24న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గతంలో ఎన్‌హెచ్ 10 సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన అనుష్క శర్మ... మళ్లీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనుష్కతో పాటు దిల్జిత్ దోసాంజ్, సూరజ్ శర్మ, మెహరీన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











