»   »  ఫోటోలు : భార్యతో అల్లు అర్జున్ సరదాగా...!

ఫోటోలు : భార్యతో అల్లు అర్జున్ సరదాగా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య వరుసగా సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఎంత షూటింగులో బిజీ ఉన్నప్పటికీ వీలు చూసుకుని పెళ్లైన కొత్తలో తీర్చుకోవాల్సిన సరదాలను కూడా తీర్చుకుంటున్నాడు స్టైలిష్ స్టార్. ఇటీవల షూటింగుల నిమిత్తం యూరఫ్ లో పర్యటించిన అల్లు అర్జున్....భార్య స్నేహారెడ్డితోనూ కొంత సమయం సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో చూడొచ్చు.

ప్రస్తుతం తన తాజా సినిమా 'రేస్ గుర్రం' చిత్రం షూటింగులో భాగంగా యూరఫ్ లో ఉన్నారు. కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రేస్ గుర్రం' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ మాయ చేసావెకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈచిత్రానికి పని చేస్తున్నారు.

స్లైడ్ షోలో అల్లు అర్జున్ రేస్ గుర్రం వివరాలతో పాటు, బన్నీ-స్నేహ వివాహ బంధానికి సంబంధించిన వివరాలు...

ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

అల్లు అర్జున్ సరసన శృతి హీసన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్యామ్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల వివాహం మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న ఈ దంపతులపై ఇటీవల ఓ షాకింగ్ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. అల్లు అర్జున్-స్నేహ విడాకులు తీసుకుంటున్నారని ఆ రూమర్స్ సారాంశం. ఊహించని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ కావడంతో షాకైన అల్లు అర్జున్, ఈ వార్తలపై స్పందించారు. ‘మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినప్పటి నుంచే మా మధ్య ప్రేమ మొదలైంది. నేను, స్నేహ ఎలాంటి ఘర్షణలు లేకుండా మా వైవాహిక జీవితం పట్ల సంతోషంగా ఉన్నాము' అని స్పష్టం చేసారు.

English summary
On March 8, 2011 Arjun Married Sneha Reddy, his lady love, at Hyderabad admist who's who of South Indian Film Industries and Famous Politicians. Later in 2013, there were rumors of Arjun Divorcing Sneha which were rubbished by Arjun Himself in a press meet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu