»   » రేర్ ఫొటో: నాగ చైతన్య & అఖిల్ చిన్నతనంలో!

రేర్ ఫొటో: నాగ చైతన్య & అఖిల్ చిన్నతనంలో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అన్నదమ్ములైన నాగచైతన్య, అఖిల్ చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఎలా ఉండేవారు..ఇదిగో ఈ ఫొటోలాగ ముచ్చటగా,ముద్దుగా ఉండేవారు. ఇద్దరూ కలిసి ఆడుకుంటూండేవారు..నాగచైతన్య తన తమ్ముడుని బాగా ముద్దు చేసేవారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ అఖిల్ తొలి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువ హీరో నితిన్ నిర్మిస్తున్నారు.

photo: Naga Chaitanya & Akhil in Childhood!

అఖిల్ మాట్లాడుతూ... ‘ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నేను హీరోగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. నా డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ & సుధాకర్ రెడ్డిలకు అల్ ది బెస్ట్. వీరితో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ' అని అన్నారు.

నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించే అవకాశాన్ని మా చేతుల్లో పెట్టినందుకు నాగార్జున గారికి మరియు నా సోదరుడు అఖిల్ కు థాంక్స్. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. భారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి. అని అన్నారు. ఇక అక్కినేని అఖిల్ ను హీరోగా పరిచయం చేసే భాధ్యతను తనపై ఉంచిన నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని దర్శకుడు వివి వినాయిక్ తెలిపారు. శ్రీ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు

వినాయిక్ మాట్లాడుతూ... ఫ్యాంటసీ నేపధ్యంలో సాగే ప్రేమ కథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్బుతమైన స్క్రిప్టు ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాధోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.అభిమానులు కోరుకునే మాస్,మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయి అన్నారు.

English summary
The above picture is a proof of the lovely bond Naga Chaitanya and Akhil shared since childhood.
Please Wait while comments are loading...