»   » ఫోటో : అన్నపూర్ణ స్టూడియోలో పవన్ మూవీ సెట్

ఫోటో : అన్నపూర్ణ స్టూడియోలో పవన్ మూవీ సెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇక్కడ రేవ్ పార్టీ నేపథ్యంలో సాగు సాంగ్ చిత్రీకరణ సాగుతోంది. గణేష్ మాస్టర్ నేతృత్వంలో నిన్నటి నుంచి సాంగ్ చిత్రీకరిస్తున్నారు. సెట్లో గణేష్ మాస్టర్ టీంతో పవన్ ఉన్న ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

ఈ నెలలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విడుదల కానున్నాయి. ఇప్పటికే పవన్ నటించిన జల్సా, గబ్బర్ సింగ్ చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా తనదైన మార్కుతో టాప్ లేచిపోయే విధంగా ట్యూన్స్ కంపోజ్ చేసారు.

కాగా...గత కొంత కాలంగా ఈచిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ అనే ప్రచారం జరుగుతోంది. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. త్వరలో అఫీషియల్ టైటిల్ ప్రకటించనున్నారు. ఆగస్టు నెలలో ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫూర్తయిన నెల రోజుల గ్యాప్‌తో సంపత్ నంది దర్శకత్వంలో పవన్ నటించే మరో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

English summary
Power Star Pawan Kalyan’s Attarintiki Daaredi is currently in the post-production phases. The film’s shooting has reached final leg and the unit has commenced post-production works of the film. The final song of the film is being canned currently and along with Pawan Kalyan, Samantha and Praneetha, the party song will also feature Hamsa Nandini and Mumtaz.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu