»   » రామ్ చరణ్ కెమెరామెన్‌గా మారితే ఇలా..(ఫోటో)

రామ్ చరణ్ కెమెరామెన్‌గా మారితే ఇలా..(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కెమెరామేన్‌‌గా మారితే ఎలా ఉంటుంది? ఇలా ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలాలా ఉంటుంది. తన తాజా సినిమా 'ఎవడు' చిత్రం షూటింగ్ సందర్భంగా రామ్ చరణ్ ఇలా కెమెరామెన్ అవతారం ఎత్తారు. కేవలం నటనకే పరిమితం కాకుండా....టెక్నికల్ అంశాల గురించి చెర్రీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండటం సినిమా రంగంపై రామ్ చరణ్ అభిరుచి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కాగా...ఎవడు చిత్రం ఈ నెలాఖరున విడుదలవుతోంది. సెంటిమెంటు కలిసొస్తుందని జులై 31(మగధీర రిలీజ్ డేట్)ని ఫైనల్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ చిత్రం చెర్రీ కెరీర్లోనే పెద్ద హిట్టవుతుందని, మగధీరను మించిన హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ఎవడు సినిమాను చూసి బంపర్ హిట్టవుతుందని జోష్యం చెప్పారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు.

మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయిన అంటున్నారు. జయసుధ, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్బీ శ్రీరామ్‌, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సహ నిర్మాతలు: శిరీష్‌ - లక్ష్మణ్‌, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.

English summary
Ram Charan turned as Choreographer in Yevadu movie sets. Yevadu is directed by Vamsi Paidipally. The film stars Ram Charan Teja, Shruti Haasan and Amy Jackson in lead roles. Allu Arjun and Kajal Aggarwal will be seen in a 15 minute cameo, which the director claims is a key portion in the script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu