For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2012 లో పరిచయమైన హీరోయిన్స్ వీరే(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: 2012 ..కొత్త హీరోయిన్స్ కి కలిసి రాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరంలో వందకు పైగా సినిమాలు నిర్మాణమయ్యాయి. దాదాపు పదిమందికి పైగా కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేసారు. మోనాల్ గజ్జర్ తప్ప ఏ హీరోయిన్ కీ కలిసి రాలేదు. అయితే తెలుగులో చేయాలని ఉవ్విళ్లూరే హీరోయిన్స్ కి మాత్రం ఉత్సాహం తగ్గలేదు. Oneindia వారిని మరోసారి గుర్తు చేస్తూ..వారి కెరీర్ లపై వారి పరిచయ చిత్రం ప్రభావం,ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తోంది.

  కొత్త హీరోయిన్స్, హీరోలు పరిచయం గ్రాండ్ గా ఉంటే సరిపోదు. ఆ సినిమా హిట్టైతేనే నాలుగు సినిమాలు వస్తాయి. సినిమా ప్లాప్ అయితే వారిలో ఎంత టాలెంట్ ఉన్నా ప్రపంచం పట్టించుకోదు. కేవలం సక్సెస్ మీద ఆధారపడిన ఈ పరిశ్రమలో అదృష్టం కూడా తనవంతు పాత్ర పోషిస్తూంటుంది. ఈ ముద్దుగుమ్మల్లో ఎంతమంది వచ్చే సంవత్సరంకి ప్రమోట్ అవుతారో.. ఎంత మంది ఫేడవుట్ అవుతారో చూడాలి.

  'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన సుడిగాడు...ద్వారా మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఆమె వెన్నెల 1 ½ తో మరోమారు భాక్సాఫీస్ ని పలకరించింది.సుడిగాడుతో ఆమెకు సుడి తిరిగినట్లే అయ్యింది.

  ప్రముఖ నిర్మాణ సంస్ధ ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నిర్మించిన రిషి చిత్రంతో సుప్రియ శైలజ పరిచయమైంది. చిత్రం భాక్సాఫీస్ వద్ద నిరాశపరచింది. మెడికల్ ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో ఏ ఆఫరూ రాలేదు. అయితే ఆమె వైద్య విద్యానిగా సినిమాలో బాగా చేసిందని పేరు మాత్రం వచ్చింది.

  చాలా కాలం క్రితం బాలాజీ మోహన్ దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ (ఈ షార్ట్ ఫిల్మ్ నే సిద్దార్థ్ హీరోగా ‘లవ్ ఫెయిల్యూర్' అని నిర్మించారు) ద్వారా పరిచయమైన నటి రెజీనా. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘ఎస్.ఎం.ఎస్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వస్తున్న ‘రొటీన్ లవ్ స్టొరీ'తో రెజీనా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం విడుదలైతే ఆమెకు మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది.

  కేక డిజాస్టర్ తర్వాత నాలుగేళ్ల విరామం తీసుకుని మరీ తేజ రూపొందించిన 'నీకు నాకు డాష్‌ డాష్‌' మొదటి రోజు మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం ద్వారా నందిత పరిచయమైంది. అయితే ఆమె అబినయానికి మంచి మార్కులు పడటంతో ఆమెకు మరో చిత్రం వచ్చింది. ఎంఎస్ఎస్ తో తెలుగు తెరకు పరిచయమైన మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా రూపొందే ‘ప్రేమకథా చిత్రమ్'లో ఆమెని తీసుకున్నారు.

  తనీష్ హీరోగా వచ్చిన ''మేం వయస్సుకు వచ్చాం''చిత్రంతో పరిచయమైన నీతి టేలర్ కి ఆసినిమా హిట్టైనా బ్రేక్ రాలేదు. తమిళంలో కలియుగం చిత్రం చేసిన ఆమెకు అక్కడ ఆఫర్స్ వస్తున్నాయి.

  తన కుమారుడు సుమంత్ అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్న 'తూనీగ..తూనీగ' చిత్రం తో రియా చక్రవర్తి పరిచయమైంది. ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో ఆమెకు ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు.

  యస్వీ రంగారావు మనవడు జూనియర్‌ ఎస్‌.వి.ఆర్‌ హీరోగా పరిచయం అవుతూ చేసిన మిస్టర్‌ 7 చిత్రంతో నీలం ఉపాధ్యాయ పరిచయం అయ్యింది. ఆ సినిమా ఫెయిల్యూర్ ఆమెకు ఇక్కడ కెరీర్ లేకుండా చేసేసింది.

  వివాదాస్పద చిత్రం 'సారీ టీచర్‌' తో పరిచయమైన కావ్యా సింగ్ సినిమాలో గ్లామర్ బాగానే ఒలకపోసింది. అయితే సినిమా రిజల్ట్ బాగా తేడాగా ఉండటంతో ఆమె గ్లామర్ బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయింది. తెలుగులో ఒక్క ఆఫర్ కూడా సంపాదించలేకపోయింది.

  English summary
  Telugu filmmakers have introduced to nearly 10 actress 2012 year. But except Monal Gujjar, hardly any other actress is successful in striking the gold in their debut movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X