twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కానీ నాన్నగారు ఒప్పుకొనేవారు కాదు: రామ్ చరణ్ (ఫోటోలు)

    By Srikanya
    |

    ''నాన్నని అప్పుడప్పుడూ అడుగుతుండేవాడిని.. పుస్తకం రాయొచ్చు కదా? అని. కానీ ఆయన ఒప్పుకొనేవారు కాదు. 'మన గురించి మనం రాసుకోవడం దేనికి?' అనేవారు. ఆయన జీవిత చరిత్ర రాస్తానని చాలామంది అడిగారు. అందుకూ అంగీకరించలేదు. డాడీపై ఓ పుస్తకం రావడం ఆనందంగా ఉంది''అన్నారు రామ్ చరణ్.

    చిరంజీవిపై పాత్రికేయుడు పసుపులేటి రామారావు రచించిన 'మెగా చిరంజీవితం' అనే పుస్తకాన్ని ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. తొలి ప్రతిని రామ్‌చరణ్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ...తనదేమీ ఇన్‌స్పైరింగ్ లైఫ్ కాదని ఆయన అంటుండేవారు.

    నాన్న గురించి రామారావు పుస్తకం తేవడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాకు తెలీని విషయాలున్నాయి. ఆయన రెండో భాగం రాస్తే నాన్న గురించిన మరిన్ని వ్యక్తిగత విషయాలు, ఫొటోలు అందజేస్తాం' అన్నారు. కన్నుల పండుగగా జరిగిన ఆ పంక్షన్ ఫోటోలు మీకోసం...

     కానీ నాన్నగారు ఒప్పుకొనేవారు కాదు: రామ్ చరణ్ (ఫోటోలు)

    ఇది చిరంజీవి బయోగ్రఫీ 'మెగా చిరంజీవితం-సినీ ప్రస్దానం'పుస్తకం కవర్ పేజీ,వెనక పేజీ.

    సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు 'మెగా చిరంజీవితం'పుస్తకం ఆవిష్కరించారు

    సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు 'మెగా చిరంజీవితం'పుస్తకం ఆవిష్కరించారు

     కానీ నాన్నగారు ఒప్పుకొనేవారు కాదు: రామ్ చరణ్ (ఫోటోలు)

    రామ్ చరణ్ ...పుస్తకాన్ని నాగేశ్వరరావు చేతుల మీదుగా స్వీకరించారు.

    కానీ నాన్నగారు ఒప్పుకొనేవారు కాదు: రామ్ చరణ్ (ఫోటోలు)

    'మెగా చిరంజీవితం' పుస్తకం ఆవిష్కరణ చాలా ఘనంగా జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, కె.ఎస్‌.రామారావు, వాకాడ అప్పారావు, రేలంగి నరసింహారావు, ఏడిద నాగేశ్వరరావు, డా.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

     కానీ నాన్నగారు ఒప్పుకొనేవారు కాదు: రామ్ చరణ్ (ఫోటోలు)

    పుస్తకావిష్కరణ అనంతరం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ని పొగుడుతూ,ఆయన కంట్రిబ్యూషన్ గొప్పతనాన్ని వివరిస్తూ మాట్లాడారు.

    కానీ నాన్నగారు ఒప్పుకొనేవారు కాదు: రామ్ చరణ్ (ఫోటోలు)

    అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ... ''సినిమాల్లో డ్యాన్సులు చేయడం నాతోనే ప్రారంభమైంది. అయితే చిరంజీవి నృత్యంలో ఓ గొప్పదనం ఉంది. ఆయన డాన్స్‌ చేస్తుంటే.. తెరపై ఎంతమంది ఉన్నా చిరంజీవి మాత్రమే కనిపిస్తారు. అతని ఒంట్లో ఎముకలున్నాయా? అనే అనుమానం వచ్చేది. నేనెందుకలా చేయలేకపోయానా? అనుకొంటాను. ఆయన స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి. ఆయన గురించి తెలుసుకొంటే స్ఫూర్తి పొందినట్టే'' అన్నారు.

    కానీ నాన్నగారు ఒప్పుకొనేవారు కాదు: రామ్ చరణ్ (ఫోటోలు)


    అల్లు అరవింద్,రామ్ చరణ్ కలిసి అక్కినేని శాలువాతో సన్మానించారు

    కానీ నాన్నగారు ఒప్పుకొనేవారు కాదు: రామ్ చరణ్ (ఫోటోలు)


    పుస్తక రచయిత పసుపులేటి రామారావు,ఆయన కుటుంబంతో రామ్ చరణ్

    English summary
    'Mega Chiranjeevitham - Cine Prasthanam', which deals with Chiranjeevi's filmy journey, was released at a grand event held at the Prasad Labs in Hyderabad on Sunday, December 9. Senior actor Akkineni Nageswara Rao unveiled the Megastar's biography and handed it over to Chiru's son Ram Charan Teja, producers Allu Aravind, KS Ramarao, writer Paruchuri Venkateswara Rao and others on the stage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X