»   » నైట్ పార్టీకి ఎవరు వచ్చాడో చూడండి, మన స్టార్స్ అంతా మూగారు (ఫొటోలు)

నైట్ పార్టీకి ఎవరు వచ్చాడో చూడండి, మన స్టార్స్ అంతా మూగారు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ స్పెషల్ గెస్ట్ గా రావటమంటే మాటలా. అయితే బాలీవుడ్ హీరో అక్షయ్ కు, విల్ స్మిత్ కు మంచి అనుబంధం ఉంది. దాంతో ఆయన ఆదివారం రాత్రి అక్షయ్ ఇచ్చిన స్పెషల్ పార్టీకు వచ్చి సందడి చేసారు. ఇక హాలీవుడ్ హీరో వస్తున్నాడంటే ..టౌన్ లో ఉన్న స్టార్స్ వచ్చేసారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంతకీ హఠాత్తుగా అక్షయ్ పార్టీ ఎందుకు ఇచ్చాడనేగా మీ డౌట్.

ఎవరికీ సాధ్యం కానంత వేగంతో సినిమాలు చేయడమే కాదు... హిట్లు కొట్టడం అక్షయ్‌ ప్రత్యేకత అని ఎవరైనా ఒప్పుకుంటారు. అందుకు ఉదాహరణ... ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లోనే 'ఎయిర్‌లిఫ్ట్‌', 'హౌస్‌ఫుల్‌ 3', 'రుస్తుం' చిత్రాలతో సక్సెస్ లు అందుకున్నాడు అక్షయ్‌.

ఈ మూడు చిత్రాలూ రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. ఇలా ఒకే ఏడాది ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన అక్షయ్‌ తన ఆనందాన్ని సన్నిహితులతో పంచుకోడానికి ప్రత్యేక వేడుక నిర్వహించాడు. దీనికి హాలీవుడ్‌ హీరో విల్‌ స్మిత్‌ అతిథిగా విచ్చేయడం విశేషం.

ఇక ఈ వేడుకలో అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నాతో పాటు బాలీవుడ్‌ తారలు సోనాక్షి సిన్హా, ఆలియా భట్‌, శ్రద్ధా కపూర్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, అర్జున్‌ కపూర్‌, కరణ్‌జోహార్‌ సందడి చేశారు. వారు విల్‌ స్మిత్‌తో సరదాగా గడిపిన క్షణాలను ఫొటోల్లో బంధించి ఆన్‌లైన్లో షేర్ చేసారు.

ఆ ఫోటోలు మీరు క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు....

ట్వింకిల్ తో

ట్వింకిల్ తో

అక్షయ్ భార్య ఈ ఫొటో ని షేర్ చేసి...ఎవరు రాత్రి పార్టీకు వచ్చారో చూడండి అంది

ఒకే ఫ్రేమ్ లో

ఒకే ఫ్రేమ్ లో

ఒకే ఫ్రేమ్ లో బాలీవుడ్ సూపర్ స్టార్, హాలీవుడ్ సూపర్ స్టార్ ..ముచ్చటగా లేదూ

సోనాక్షి

సోనాక్షి

వైట్ టాప్ తో సోనాక్షి సిన్హా ఇలా తమ అభిమాన హీరోతో కలసి ఫొటో దిగింది

అలియా

అలియా

ఈ ఫొటోను అలియా భట్ షేర్ చేసింది. ఈ ఫొటోలో అలియా తో పాటు జాక్విలిన్, వరుణ్ ధావన్ కూడా ఉన్నారు

జాక్విలన్ పోస్ట్

జాక్విలన్ పోస్ట్

ఈ ఫొటోను హీరోయిన్ జాక్విలిన్ పోస్ట్ చేసింది. ఈ క్రేజీ ఫొటోలో..రణబీర్ కపూర్, సోనాక్షి, సిద్దార్ద మల్హోత్రా, ట్వింకిల్ ఖన్నా, కరుణ్ జోహార్, అక్షయ్, శ్రద్దా కపూర్, అర్జున్ కపూర్, రోహిత్ ధావన్ ఉన్నారు.

ఈషా గుప్త

ఈషా గుప్త

ఈ ఫొటోను హీరోయిన్ ఈషా గుప్త పోస్ట్ చేసింది.

లవ్ లీ కపుల్ తో

లవ్ లీ కపుల్ తో

అక్షయ్,ట్వింకిల్ తో కలసి సోనాక్షి ఈ ఫొటో దిగింది

రణబీర్

రణబీర్

ఈ పార్టీకి రణబీర్ కపూర్ వచ్చినప్పుడు ఇలా...

క్యూటీస్

క్యూటీస్

శ్రద్దా కపూర్, అలియా భట్ ఇద్దరూ కూడా పార్టీకు వచ్చినప్పుడు

సోనమ్

సోనమ్

సోనమ్ కపూర్ ..విల్ స్మిత్ పార్టీకి వచ్చి ఆనందంతో..

అర్జున్ కపూర్

అర్జున్ కపూర్

పార్టీ జరుగుతూంటే అక్షయ్ బంగ్లా బయిట నిలబడ్డ అర్జున్ కపూర్

వెడ్డింగ్ ప్లానర్

వెడ్డింగ్ ప్లానర్

పాపులర్ వెడ్డింగ్ ప్లానర్ గుర్లిన్ తో కలిసి విల్ స్మిత్ ఫొటో దిగారు

English summary
Hollywood superstar Will Smith, was the special guest at Akshay Kumar's grand celebration on Sunday night, to celebrate his successful year. Akshay hosted the party for his friends for delivering three back-to-back successful films including Airlift, Housefull 3 and Rustom all having crossed the 100-crore mark.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu