మందు, విందు..... జోరుగా తెలుగు హీరోయిన్ బర్త్ డే పార్టీ (ఫోటోస్)
ఇటీవలే అనిత 35వ పుట్టినరోజు వేడుక జరుపుకుంది. తన టీవీ ఫీల్డ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ముంబైలో గ్రాండ్ గా పార్టీ చేసుకుంది.
హైదరాబాద్: తెలుగు హీరోయిన్ అనిత రెడ్డి గుర్తుందా? ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన 'నువ్వు నేను' సినిమా ద్వారా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అనిత... తొలి సినిమాతోనే విజయం అందుకు అప్పట్లో వరుస అవకాశాలు దక్కించుకుంది.
అయితే 'నువ్వు నేను' తర్వాత అనిత చేసిన సినిమాలేవీ బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాలేదు. దీంతో క్రమక్రమంగా అనితకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. దీంతో సినిమాల నుండి రూటు మార్చి టవీ సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టిన అనిత..... ప్రస్తుతం హిందీ సీరియల్స్ తో బిజీ అయిపోయింది.

బర్త్ డే పార్టీ
ఇటీవలే అనిత 35వ పుట్టినరోజు వేడుక జరుపుకుంది. తన టీవీ ఫీల్డ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ముంబైలో గ్రాండ్ గా పార్టీ చేసుకుంది.

మందు, విందు
ఈ పార్టీలో మందు, విందుతో అతిథులకు సకల మర్యాదలు చేసారు. ఈ పార్టీకి సంబంధించిన ఏర్పాట్లను అనిత రెడ్డి భర్త... రోహిత్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు.

ముద్దు ముచ్చట
2013లో అనిత రెడ్డి, రోహిత్ రెడ్డిల వివాహం జరిగింది. భార్యతో కేక్ కట్ చేయించి అతిథుల సమక్షంలో ఆమెపై తీయటి ముద్దుల వర్షం కురిపించాడు రోహిత్.

భార్య గురించి రోహిత్
నా జీవితంలో... నాకు తెలిసిన మోస్ట్ ఇన్ స్పైరింగ్, జెన్యూన్, కైండ్, హంబుల్ పర్సన్, మై బెస్ట్ ఫ్రెండ్, మై లవర్, మై సోల్ మేట్, మై లైఫ్.... అనిత మాత్రమే, మై స్వీట్ హార్ట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రోహిత్ రెడ్డి ఎంతో రొమాంటిక్ గా తన భార్యను విష్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.

పుట్టినరోజు వేడుక
ఏప్రిల్ 14న ముంబైలో అనిత రెడ్డి పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ వేడుకకు హిందీ టీవీ స్టార్స్ అంతా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











