»   » గౌతమి, ఆమె కూతురుతో కలిసి కమల్ హాసన్(ఫోటోలు)

గౌతమి, ఆమె కూతురుతో కలిసి కమల్ హాసన్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నటుడు కమల్ హాసన్, నటి గౌతమి గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్‌కు శృతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గౌతమికి సుబ్బలక్ష్మి అనే కూతురు ఉంది. కమల్ హాసన్ చాలా అరుదుగా తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా ఫంక్షన్లలో కనిపిస్తూ ఉంటారు.

తాజాగా కమల్ హాసన్.... గౌతమి, ఆమె కూతురు సుబ్బలక్ష్మితో కలిసి గురువారం ప్రారంభమైన 15వ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో దర్శనం ఇచ్చారు. కమల్ హాసన్ ఫార్మల్ వేర్లో, ఆయన పార్ట్నర్ గౌతమి పింక్ జరీ కాంచీవరమ్ చీరలో, సుబ్బలక్ష్మి మోడ్రన్ డ్రెస్సులో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ఈ ముగ్గురు కలిసి రావడంతో మీడియా ఫోకస్ అంతా వారి వైపే పెట్టింది.

ఇండియన్ సినిమా పరిశ్రమకు కమల్ హాసన్ చేసిన సేవకుగాను ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన్ను లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ కోస్టా-గావ్రాస్, ప్రముఖ లఘు చిత్ర దర్శకుడు శ్యామ్ బెనగల్ తదితరులు పాల్గొన్నారు.

బాలచందర్ వల్లనే ఈ స్థాయికి: కమల్

బాలచందర్ వల్లనే ఈ స్థాయికి: కమల్


‘బాలచందర్ గారి వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగాను. ఆయనే నాలోని నటుడుని ఈ ప్రపంచానికి పరిచయం చేసారు' అని కమల్ హాసన్ తెలిపారు.

గురువే సృష్టించాడు

గురువే సృష్టించాడు


బాలచందర్ నాకు గురువు. గురువు అంటే ఆయనలానే ఉండాలి. నా విజయం వెనక, నేను ఈ స్థాయికి రావడం వెనక ఆయన కృషి ఎంతో ఉంది. నాకు ఇచ్చిన ఈ అవార్డు ఆయనకే అంకితం అన్నారు కమల్ హాసన్

ఓపెనింగ్ సెర్మనీ..

ఓపెనింగ్ సెర్మనీ..


ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా లీ డేనియల్ హిస్టారికల్ ఫిక్షన్ డ్రామా ‘ది బట్లర్ స్టారింగ్ ఫారెస్ట్ వైటేకర్' చిత్రాన్ని ప్రదర్శించారు. ఓఫ్రా విన్‌ఫ్రే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. అక్టోబర్ 24న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ముగియనుంది. చివరి రోజు బిల్ కండన్ సినిమా ‘ది ఫిప్త్ ఎస్టేట్' చిత్రం ప్రదర్శించనున్నారు.

15వ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్

15వ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్


బాలీవుడ్ బ్యూటీలు సోనాక్షి సిన్హా, టిస్కా చోప్రా, నందితా దాస్, దివ్యా దత్తా తదితరులు ఈ 15వ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా


ఈవింగ్ కార్యక్రమానికి సోనాక్షి సిన్హా స్పెషల్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఆమె డ్రెస్సింగ్ అందరినీ ఆకట్టుకుంది.

ఇతర అతిథులు

ఇతర అతిథులు


ఈ కార్యక్రమానికి ఇంకా సిద్ధిఖీ బర్మార్క్, దీపా మెహతా, వారిస్ ముస్సేన్, రోజెర్ గార్సియా, అస్ఘర్ పర్హాది, కొంకణా సేన్ శర్మ తదితరులు హాజరయ్యారు.

200 చిత్రాల ప్రదర్శన

200 చిత్రాల ప్రదర్శన


రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రోత్సవంలో 200 చిత్రాలు ప్రదర్శించనున్నారు. స్పానిష్ సినిమాలు, కొలంబియన్ సినిమాలు, ఫ్రెంచి సినిమాలు ప్రదర్శించనున్నారు.

English summary
Very rarely we see Kamal Hassan spotting with his family members. The actor, on Thursday (October 17), was spotted with his partner Gauthami and her daughter Subbulaksmi at the ongoing 15th edition of Mumbai Film Festival (MFF).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu