»   » సినిమా హిట్: పార్టీ చేసుకున్న హీరో హీరోయిన్ (ఫోటోలు)

సినిమా హిట్: పార్టీ చేసుకున్న హీరో హీరోయిన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సోనాక్షి సిన్హా, రణవీర్ సింగ్ జంటగా రూపొందిన బాలీవుడ్ క్లాసిక్ మూవీ 'లూటేరా' ఇటీవల విడుదలై విజయవంతం అయిన నేపథ్యంలో హీరో హీరోయిన్లు, నిర్మాత ఏక్తకపూర్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోనాక్షి-రణవీర్ సినిమాలోకి పాటలకు స్టెప్పులేసి సందడి చేసారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు, సోనాక్షి తండ్రి శత్రుజ్ఞ సిన్హా కూడా హాజరయ్యారు.

లూటేరా' బాలాజీ-ఫాటామ్స్ పిక్చర్స్ పతాకంపై ఏక్తాకపూర్ నిర్మించిన ఈ చిత్రానికి విక్రమాదిత్య మోత్వాని దర్శకుడు. అమెరికా రచయిత రాసిన 'లాస్ట్ లీఫ్' అనే కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ హృద్యంగా తెరక్కిన ప్రేమకథా చిత్రమిది.

సోనాక్షి సిన్హా, రణవీర్‌సింగ్, బరున్ చందా, విక్రాంత్ మాస్సే, ఆరిఫ్ జకారియా, అదిల్ హుస్సేన్, దిబ్యేందు భట్టాచార్య, దివ్యదత్తా తదితరులు నటిచిన ఈచిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, సినిమాటోగ్రఫీ: మహేంద్ర శెట్టి, నిర్మాతలు: ఏక్తాకపూర్, శోభాకపూర్
దర్శకత్వం: విక్రమాదిత్య మోత్వానీ

లూటేరా చిత్రం ఒ నిశ్శబ్దమైన ప్రేమకథా చిత్రం. 1950 ప్రాంతంలో పశ్చిమబెంగాల్‌లోని మానిక్‌పూర్ అనే పల్లెటూరు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఆ ఊళ్లో ఏళ్లనాటి జమీందారీ వంశం. స్వాతంత్య్రానంతరం జ మీందారీ గిరీ పోయి- ఒంటరిగా మిగిలిన జమీందార్. ఆయన కూతురు పాఖీ (సో నాక్షి సిన్హా). ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఒకనాడు చక్రవర్తుల ఏలుబడిలో వైభవోపేత చరిత్రతో అలరారింది. దీంతో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్లు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపటానికి ఆర్కియాలజిస్ట్ వరుణ్ (రణవీర్ సింగ్)ని పంపిస్తుంది.


శిథిలమై పోయిన చరిత్రని వెలికి తీస్తూండగా.. వరుణ్‌కి పాఖీ పరిచయ మవుతుంది. ఆమె అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తుంది. కమ్మగా పాడుతుంది. జీవితాల్ని కథలుగా మలుస్తుంది. నవలలు రచిస్తుంది. పేజీలకొద్దీ మాటల్ని ప్రేమగా ఆరాధిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది.


జమీందార్ భవంతిలోని పురాతన వస్తువులన్నీ ఈస్టిండియా కంపెనీ ఇచ్చిందన్న అభియోగంపై వాటిని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్లు స్వాధీనం చేసుకుంటారు. అయితే ఇదంతా వరుణ్ అండ్ గ్యాంగ్ చేసిన మోసమే అని తెలిసేలోపే అతను అక్కడి నుంచి జంప్ అవుతాడు.


మోసపోయాననే విషయం తెలుసుకుని జమీందారు గుండెపోటుతో మరణిస్తాడు. తండ్రి చనిపోవటంతో ఒంటరిదైన పాకీ డల్హౌసీ చేరుతుంది. వరుణ్ అసలు స్వరూపం ఏమిటి? అతడు చేస్తున్నదేమిటి? చివరికి వరుణ్ పాఖీని చేరాడా? అనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి.


ఈ సినిమాలో మనసును హత్తుకునే కాన్సెప్టు ఒకటుంది. చెట్టుకున్న ఒక్క పండుటాకు రాలితే.. తన బతుకులో చిట్టచివరి ఘట్టం వస్తుందని హీరోయిన్ ‘ఆశ'గా ఎదురుచూట్టం.. ఆ ‘చిగురుటాకు' రాలకపోవటం, ఆకు రాలిపోకుండా హీరోచేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది.


లూటరా సినిమా చూస్తుంటే సత్యజిత్ రాయ్, గురుదత్ కాలం నాటి సినిమా ఏదైనా చూస్తున్నామా అన్న అనుభూతి కలుగుతుంది. సినిమాటోగ్రఫీ కూడా అప్పటి సినిమాలను గుర్తు తెచ్చే విధంగా ఉండటం గమనార్హం.


లూటేరా విజయంతో చిత్ర యూనిట్ సభ్యులు ఆనందంలో మునిగి పోయారు. అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఇటీవల ముంబైలో సందడిగా సాగింది. ఈ వేడుకకు సోనాక్షి తండ్రి శతృజ్ఞ సిన్హా కూడా హాజరయ్యారు.

English summary
Ekta Kapoor hosted a bash to celebrate the success of her movie 'Lootera'. Saw the lead couple Sonakshi Sinha, Ranveer Singh, Shahid Kapoor, Ranveer Singh seemed to be in high spirits as usual and was seen breaking into a jig along with Sonakshi sinha .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu